Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ కుక్క చేపను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ప్రేమ, ద్వేషం వంటి లక్షణాలు మనుషుల్లో మాత్రమే ఉంటాయని చాలా మంది నమ్ముతారు. కానీ ఇవే లక్షణాలు కొన్ని జంతువులలో కూడా ఉంటాయి. అవి కూడా ఒక్కోసారి సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ఈ వీడియో చూస్తే అసలు విషయం మీకు అర్థమవుతుంది. వీడియోలో ఓ కుక్క చేపను కాపాడటానికి ప్రయత్నించడం మనం గమనించవచ్చు. ఓ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని కాలువలో చేపలకు గాలం వేస్తుంటాడు. అతనితో పాటు ఓ కుక్క కూడా ఉంటుంది. ఆ వ్యక్తి ఒక చేపను పట్టి పక్కన ఉన్న డబ్బలో వేస్తాడు. ఇంతలో కుక్క టబ్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న చేప పరిస్థితిని గమనిస్తుంది.
వెంటనే టబ్‌ని నీటిలోకి తోసేస్తుంది. ఇది చూసి ఆ వ్యక్తి కుక్కను ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ కుక్క చేపల ప్రాణాలను కాపాడటానికి అతడిని అడ్డుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది. చాలా ఇష్టపడుతున్నారు. లైక్స్, కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. కుక్క చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. కొంతమంది విశ్వాసానికి ప్రతీక కుక్క అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు చేపకు సాయం చేయాలనే కుక్క ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
View this post on Instagram