Fake Police In AP: నకిలీ ఎస్సై నకరాలు.. అసలు పోలీసులకుచిక్కి..వీడియో వైరల్.

Fake Police In AP: నకిలీ ఎస్సై నకరాలు.. అసలు పోలీసులకుచిక్కి..వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Sep 06, 2021 | 8:29 AM

వెనకటికి నక్క ఒకటి అడవికి రాజునైపోవాలనుకొని ఒంటికి రంగు వేసుకొని అడవి జంతువులపై ఆధిపత్యం చెలాయించింది. ఒక్కసారి వానలో తడిచేసరికి నక్క అసలు రంగు బయటపడి చివరికి తోకముడిచింది.. సరిగ్గా ఇలాగే జరిగింది..

వెనకటికి నక్క ఒకటి అడవికి రాజునైపోవాలనుకొని ఒంటికి రంగు వేసుకొని అడవి జంతువులపై ఆధిపత్యం చెలాయించింది. ఒక్కసారి వానలో తడిచేసరికి నక్క అసలు రంగు బయటపడి చివరికి తోకముడిచింది.. సరిగ్గా ఇలాగే జరిగింది.. ఈ నకిలీ ఎస్సై విషయంలో కూడా. ఖాకీ డ్రస్సుపై ఉన్న మక్కు వతో ఓ యువకుడు ఎస్సై అవతారమెత్తాడు.. వేసుకున్నాడు సరే… అంతటితో ఆగకుండా రోడ్డుపైకి వచ్చి ఎస్సైలాగ బిల్డప్‌లిస్తూ అంరికీ హుకుం జారీచేయడం మొదలెట్టాడు. అందరితో సలాములు కొట్టించుకున్నాడు.. ఆఖరికి జైలుపాలయ్యాడు… అంతేకదండీ… మోసం చేస్తే ఎప్పటికైనా బయటపడక తప్పదు కదా…

ఈ నకిలీ ఎస్సై పేరు పూడి మహేష్‌. ఊరు.. విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని వీరభద్రపేట. డిగ్రీ వరకు చదివాడు. పోలీస్‌ డ్రస్‌ పై మక్కువతో ఎస్సైలా అవతారమెత్తాడు. ఓ ఖాకీ డ్రెస్సును సంపాదించి.. తలపై టోపీ, నడుముకు మూడు సింహాల బెల్ట్‌తో టిప్‌టాప్‌గా తయారయ్యాడు. ఇక బైక్‌ ఎక్కి ఊరిమీదకు బయలుదేరాడు. చూసిన వారంతా అతనికి ఎస్సై అనుకుని సలాం చేయడం మొదలెట్టారు. ఇదేదో బావుందనుకుని మనోడు ఎస్సై గెటప్‌ను కంటిన్యూ చేసేసాడు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఎస్సైనని చెప్పి తన సొంత పనులు చేయించుకోవడం మొదలుపెట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా ఈ నకిలీ ఎస్సై యవ్వారం ఇలా సాగిపోతోంది.

జోరుగా హుషారుగా షికారు పోతున్న మనోడికి అసలు పోలీసులు తగిలారు. అనకాపల్లిలో అసలు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఎంఎస్‌రావ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద వాహనాలను ఆపి వెరిఫై చేస్తున్నారు. ఇంతలో రింగురోడ్డువైపు నుంచి ఖాకీ డ్రెస్సులో హెల్మెట్‌ పెట్టుకుని మరీ వచ్చేస్తున్నాడు మనోడు. ఒక్కసారిగా అసలు పోలీసులను చూసి ఖంగు తిన్నాడు. తోక ముడిచి పారిపోయే లోపు పోలీసులు అతన్ని ఆపి ఆరా తీశారు. తాను ఎస్సైనని నమ్మించడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఐడీ కార్డ్‌ కూడా చూపించాడు. ఓ దశలో నిజంగానే ఎస్సైఅని నమ్మిన అనకాపల్లి పోలీసులు.. అతని మాటల్లో తేడా కొట్టడంతో అనుమానం వచ్చి వెరిఫై చేసేసరికి ఆ పేరుతో ఎవరూ ఎస్సైలు లేరని ప్రాథమికంగా తేలింది. దీంతో.. మహేష్‌ను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నకిలీ ఎస్సైగా అంగీకరించాడు. మహేష్‌పై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కునెట్టారు.

మరిన్ని ఇక్కడ చూడండి: మందుబాబులకు సర్కార్ షాక్‌..!మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి (వీడియో).Vaccination Must Video.

FYI With Swathi: అతిగా వర్కౌట్ చేస్తే చనిపోతారా? ట్రెండ్ గా మారిన ఫిట్ నెస్ ప్రాణాలు మీదకొచ్చిందా..?(వీడియో).

విశాఖ జిల్లాలో అమానవీయ ఘటన..! ముళ్ళపొదల్లో ఏడుస్తూ పసిపాప(వీడియో): Baby Rescue Video.

Afghanistan Leader:ఆఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం..!సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా(వీడియో).