Bigg Boss 5 Telugu: అమ్మ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడు వదిలి ఉండలేదు.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 12, 2021 | 4:58 PM

బిగ్ బాస్ హౌస్ సీజన్ 5 సందడి మొదలైంది. హుషారుగా మొదలైన ఈ సీజన్‌లో ఎంటర్టైనర్ చేయడానికి ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss 5 Telugu: అమ్మ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడు వదిలి ఉండలేదు.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్..
పలు సినిమాలతో ఆకట్టుకున్న మానస్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మానస్ 16వ కంటెస్టెంట్. సూపర్ ఎనర్జిటిక్ పవన్ కళ్యాణ్ సాంగ్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు మానస్.

Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ సీజన్ 5 సందడి మొదలైంది. హుషారుగా మొదలైన ఈ సీజన్‌లో ఎంటర్టైనర్ చేయడానికి ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు అందరు ప్రేక్షకులకు తెలిసిన వాళ్ళే. ఎంతో ఉత్సాహంగా మొదలైన ఈ సీజన్ మరింత ఎంటర్టైన్ చేయబోతుందంటూ కింగ్ నాగార్జున ఇప్పటికే హింట్ ఇచ్చారు. నాగ్ చెప్పినట్టే హౌస్‌లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మొదటి రోజు కావడంతో ఇంటి సభ్యులంతా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ.. డాన్స్‌లు వేస్తూ సరదాగా గడిపారు. హౌస్‌లోకి వచ్చిన వాళ్లలో అందరు ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారే.. వీరిలో సీరియల్ నటుడు మానస్ కూడా ఉన్నారు. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ కనిపించి ఆకట్టుకున్నాడు మానస్. పదహారో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్రడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా , నటుడిగా, విలన్‌గా, హీరోగా అన్నీ ట్రై చేసి.. మరి బిగ్ బాస్ ఇంట్లో ఎంటర్ అయ్యాడు మానస్.

సోడా గోలి సోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజ్‌ కాయ్‌ వంటి సినిమాలలో మానస్ నటించాడు. అయితే.., ఇవేవి ఇతని కెరీర్ గ్రాఫ్‌ని అమాంతం పెంచలేకపోయాయి. ఇక సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమ్మను వదిలి ఉండలేను అంటూ.., కాస్త భారంగానే మానస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నువ్ తల్లి చాటు బిడ్డవి అని విన్నాను అని నాగ్ ప్రశ్నించారు. అవును నాకు మా అమ్మ అంటే ఇష్టమని మానస్ చెప్పాడు. మరి ఈ కుర్రహీరో బిగ్ బాస్ విన్నర్ అవుతాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bigg Boss 5 Telugu: బిగ్ బాసైనా.. ఎవడైనా ధమ్ ధమ్ చేస్తా.. రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ.. షాక్ అయిన నాగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతావర్మ గురించి మీకు తెలుసా.. అసలు ఈ అమ్మడు ఎవరంటే.?

Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu