బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. కింగ్ నాగార్జున మరింత ఉత్సాహంతో షోను ప్రారంభించారు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్తారా అన్న ఉత్కంఠకు తెరపడింది. హౌస్‌లోకి వెళ్లిన వాళ్లలో చాలా మంది ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే ఉన్నారు. నిన్న(సెప్టెంబర్ 5న ) ఘనంగా బిగ్ బాస్ ప్రారంభోత్సవం జరిగింది. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌లతో హౌస్‌మేట్స్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. షన్ముఖ్ -మానస్-ప్రియాంక సింగ్ – 7 ఆర్ట్స్ సరయు- సన్నీ-ఉమాదేవి-శ్రీరామచంద్ర-సిరి హనుమంతు-ప్రియ-శ్వేత వర్మ-లోబో-లహరి-జశ్వంత్-యాంకర్ రవి-నటరాజ్-కాజల్-విశ్వ-ఆనీ మాస్టర్-హమీద కంటెస్టెంట్స్ గా ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే.. అయితే నటి శ్వేతా వర్మ గురించి మీకు తెలుసా.. ఎక్కువగా పరిచయం లేని ఈ అమ్మడు గురించి గూగుల్‌ని గాలించేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అయితే తన గురించి, తాను చేసిన సినిమాల గురించి శ్వేతా వర్మ క్లియర్‌గా చెబుతూ క్వారంటైన్‌లోనే ఓ వీడియోను రికార్డ్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన వాళ్లలో తెలిసిన మొఖాలకంటే కంటే తెలియని మొఖాలు ఒకటి రెండు ఉన్నాయి. వాటిలో ఈ అమ్మడు ఒకరు. అసలు శ్వేతా వర్మ ఎవరు .. ఏ సినిమాల్లో నటించింది. ? శ్వేతా వర్మ మాట్లాడుతూ.. “నా పేరు శ్వేతా వర్మ. నేను ఇప్పటి వరకు చేసిన రాణి, పచ్చీస్ సినిమాలు మీరు చూసే ఉంటారు. మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రాలు కూడా రానున్నాయి. వీటితోపాటు గుడ్ లఖ్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్ విల్లా, ఇంకొన్ని వెబ్ సిరీస్‌లు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు నేను క్వారంటైన్‌లో ఉన్నాను. నేను బిగ్ బాస్ ఐదో సీజన్‌లో రాబోతోన్నాను మీ అందరికీ తెలుసు. నాకు ఈ నాకు ఈ అవకాశం రావడం చాలా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు తెరపై నేను ఎలా ఉంటానో చూశారు. ఇప్పుడు శ్వేతా వర్మను చూస్తారు. నాకు నర్వెస్, భయంగానీ లేదు. నేను పర్సనల్‌గా దేత్తడి పోచమ్మ గుడిలా ఉంటాను. ఇచ్చి పడేస్తాను.. ధైర్యంగా ఉంటాను. నేను పక్కన ఉన్న వారిని ఎప్పుడూ రెస్పెక్ట్ చేస్తాను. కానీ దాన్ని చులకనగా తీసుకుంటే నేనేంటో చూపిస్తా… నేను నాలా ఉండబోతోన్నానో మీరు చూస్తారు. నేను మీకు ఐదో సీజన్‌లో ఎంటర్టైన్ చేయబోతోన్నాను. షో ఎలా ఉంటుందో నాక్కూడా తెలియదు.. ఎంతో ఎగ్జైట్‌గా ఉన్నాను. క్వారంటైన్‌లో నేను బుక్స్ చదివాను. పాటలు వింటూ గడిపాను’ అంటూ శ్వేతా వర్మ తన గురించి చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Kangana Ranaut Photos: ‘తలైవి’గా వస్తున్న ‘కంగనా రనౌత్’.. చీరకట్టులో మెరుపులు..
Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!