Bigg Boss 5 Telugu: నన్ను ఇలాంటోడు అని వేలెత్తి చూపినవారికి సరైన సమాధానం చెప్తాను.. యాంకర్ రవి కామెంట్స్..

బిగ్‏బాస్ 5 తెలుగు: బుల్లితెరపై ఫేమస్ యాంకర్స్‏లలో రవి ఒకరు. ఎప్పుడూ టెలివిజన్ షోస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్‏టైన్ చేస్తోన్న

Bigg Boss 5 Telugu: నన్ను ఇలాంటోడు అని వేలెత్తి చూపినవారికి సరైన సమాధానం చెప్తాను.. యాంకర్ రవి కామెంట్స్..
Anchor Ravi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2021 | 7:25 AM

బిగ్‏బాస్ 5 తెలుగు: బుల్లితెరపై ఫేమస్ యాంకర్స్‏లలో రవి ఒకరు. ఎప్పుడూ టెలివిజన్ షోస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్‏టైన్ చేస్తోన్న రవి.. ఇప్పుడు బిగ్‏బాస్ 5 రియాల్టీ షోలోకి అడుగుపెట్టాడు. నిన్న సాయంత్రం బిగ్‏బాస్ సీజన్ 5 తెలుగు గ్రాండ్‍గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో బుల్లితెరపై సందడి షూరు అయింది. అయితే గత సీజన్‏లో ఎప్పుడు లేనట్టుగా ఈసారి ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లను పంపించేశారు నిర్వహకులు. మిస్టర్ మజ్ను సినిమాలోని పాటతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్‏ను స్టేజ్ పైకి పిలిచాడు నాగ్.. అయితే ఈసారి కొన్ని కొత్త ముఖాలు కనిపించాయి. యాంకర్ రవి, సన్నీ, లోబో, సిరి, ప్రియాంక సింగ్, నటి ప్రియ, ఉమాదేవి, షణ్ముఖ్, ఆర్జే కాజల్, మానస్, సరయు, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, శ్రీరామచంద్ర వంటి వారు ఎక్కువగా ఫేమస్ అయినవారే. వీరి గురించి పెద్దగా పరిచయాలు కూడా అవసరం లేదు. మరీ ఎక్కువగా యాంకర్ రవి గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్లలో రవి ఒకరు. రవి, లాస్య జోడీతో వీరిద్దరు ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత టెలివిజన్ పై పలు షోల ద్వారా ప్రేక్షకులను అలరించారు రవి. ఇప్పుడు తెలుగు రియాల్డీ గేమ్ షో బిగ్‏బాస్ 5 ఇంట్లోకి ఎంటర్ అయ్యారు రవి.. నిన్న సాయంత్రం ప్రారంభమైన బిగ్‏బాస్ షోలోకి రవి చివరి కంటెస్టెంట్‏గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే రావడంతోనే నాగ్.. అతడిని ఇరికించే ప్రయత్నం చేశారు. పెళ్లి విషయం నాకు ఇంకా చెప్పలేదంటూ రవిని ప్రశ్నించారు నాగ్. దీంతో రవి స్పందిస్తూ.. సర్.. ఆ విషయం మూడేళ్ల క్రితమే అందరికీ చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ నాకు చెప్పలేదు కదా ? అని నాగ్ అన్నారు. మీకు తెలుసు కదా ? సర్ అని రవి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంకా నన్ను కొంత మంది నమ్మడం లేదు.. వారికి నిజమైన రవిని చూపించాలే బిగ్‏బాస్ షోలోకి వచ్చాను అని అన్నారు. ఇంతవరకు అందరూ రవిని చూశారు… కానీ ఇప్పుడు అసలైన రవి కిరణ్ గురించి తెలుసుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే షోలోకి వెళ్లిన తర్వాత యాంకర్ రవి యూట్యూబ్ ఛానల్‏లో అతనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూస్తుంటే.. క్యారంటైన్‏లో యాంకర్ రవి స్వయంగా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అందులో యాంకర్ రవి మాట్లాడుతూ.. పోతున్నా.. పోతున్నా.. యస్ బిగ్‏బాస్ 5కి పోతున్న.. మీరు చూసారు నన్ను బిగ్‏బాస్ షోలోకి వెళ్లడం.. నన్ను చాలా రోజుల నుంచి అడిగారు. బిగ్‏బాస్ షోలోకి వెళ్తున్నారా అని… కానీ రూల్స్ వలన చెప్పలేకపోయాను.. రియాల్లీ సారీ. నాకు బిగ్‏బాస్ షోకి వెళ్లడానికి ఛాన్స్ వచ్చినందుకు థ్యాంక్యూ. నాకు సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్. ఇంతకు ముందు సీజన్స్ కూడా నాకు ఛాన్స్ వచ్చింది. కానీ.. నాకున్న కమిట్మెంట్స్ వలన రాలేకపోయాను. కానీ ఈసారి ఎలాగైనా ఈ షోలోకి రావాలనుకున్నాను. గత 11 సంవత్సరాలుగా మిమ్మల్ని అలరిస్తూనే ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా షో లేకుండా లేను. మిమ్మల్ని ఎంటర్‏టైన్ చేయడానికి చాలా తంటాలు పడ్డాను. ఏడ్చిన రోజులు ఉన్నాయి. డిప్రెస్డ్ అయిన రోజులు ఉన్నాయి. కానీ నా కుటుంబసభ్యులు, నా స్నేహితుల సపోర్ట్ ఉండి.. ప్రస్తుతం ఇలా ఉన్నాను. ఎవరెవరు నన్ను యాంకర్ రవి ఇలాంటోడు అని నన్ను వేలెత్తి చూపారో.. వారికి ఇప్పుడు బిగ్‏బాస్ షో ద్వారా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటివరకు యాంకర్ రవిని చూసారు.. కానీ ఇప్పుడు రవి కిరణ్ రాట్లేను చూస్తారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత పాజిటివిటి ఉంటుంది. నెగిటివి ఉంటుంది. లోపల తప్పుగా మాట్లాడిన.. చేసిన.. ట్రోల్ చేయండి.. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్‏ను ట్రోల్ చేయకండి అంటూ చెప్పుకొచ్చాడు రవి.

Also Read: Bigg Boss 5 Telugu: అది రిగ్రేట్‏గా ఫీల్ అవుతున్నాను.. బయటపడేందుకు ట్రై చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్‏ కేసుపై షణ్ముఖ్ కామెంట్స్..

Ruhani Sharma Photos: ఆపిన ఆగునా అందాలు.. మైమరిపిస్తున్న రుహానీ శర్మ.. ఎర్ర చీర సోయగాలు..

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!