మహారాష్ట్ర రైతు సాధించాడు..! హిమాచల్ ప్రదేశ్‌ ఆపిల్‌ని వేడి ప్రాంతమైన నాసిక్‌లో పండించాడు..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 06, 2021 | 1:15 PM

Chandrakant: భారతదేశంలో ద్రాక్ష ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంటుంది. నాసిక్‌లో ద్రాక్షను ఎక్కువగా పండిస్తారు. అందుకే అక్కడ వైన్ పరిశ్రమ

మహారాష్ట్ర రైతు సాధించాడు..! హిమాచల్ ప్రదేశ్‌ ఆపిల్‌ని వేడి ప్రాంతమైన నాసిక్‌లో పండించాడు..
Apples

Follow us on

Chandrakant: భారతదేశంలో ద్రాక్ష ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంటుంది. నాసిక్‌లో ద్రాక్షను ఎక్కువగా పండిస్తారు. అందుకే అక్కడ వైన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. కానీ అఖత్‌వాడే గ్రామానికి చెందిన చంద్రకాంత్ హయాలిజ్ అనే రైతు హిమాచల్ ఆపిల్‌ను నాసిక్‌లో పండించాడు. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది అంతేకాదు వాతావరణం కూడా వేడిగా ఉంటుంది. ఈ వాతావరణంలో ఆపిల్‌ని పండించడం మామూలు విషయం కాదు.

మొదటిసారి 30 మొక్కలు నాటాడు 2012 లో చంద్రాకాంత్‌ దానిమ్మ తోటను సాగు చేశాడు. వడగళ్ల వాన పంట మొత్తం నాశనం చేసింది. 15 టన్నుల పండ్లు కుళ్లిపోయాయి. తరువాత ద్రాక్షను కూడా పండించాడు కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. దీంతో 2016 లో మొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ HRMN-19 రకం ఆపిల్ సాగు గురించి తెలుసుకున్నాడు. మొక్కల వైవిధ్యాన్ని, దాని వాతావరణం, నీటి అవసరాలను అర్థం చేసుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ వెళ్లి పంటసాగుపై అధ్యయనం చేశాడు.

ఇలా జాగ్రత్త తీసుకున్నాడు చంద్రకాంత్ 2018 లో పావు ఎకరం భూమిలో 30 మొక్కలు నాటాడు. జాగ్రత్తగా చూసుకున్నాడు. 2020లో ప్రతి మొక్క ఐదు కిలోల పండ్లను ఉత్పత్తి చేసింది. యాపిల్స్ లేత ఎరుపు, పసుపు రంగులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని స్నేహితులు, బంధువులకు పంపిణీ చేశాడు. మరుసటి సంవత్సరం ప్రతి చెట్టు 20 కిలోల ఆపిల్‌లను ఉత్పత్తి చేశాయి. మొత్తం 460 కిలోల ఆపిల్స్ పండించాడు. ఇలా చంద్రకాంత్ మొదటి ప్రయత్నంలో విజయం సాధించాడు.

ఈ రకం ఆపిల్ వెచ్చని వాతావరణ పరిస్థితులలో కూడా పెరుగుతుందని, భారీ మొత్తంలో నీరు అవసరం లేదని చంద్రకాంత్‌ నిరూపించాడు. 2021లో వ్యాపార పరిస్థితులను అంచనా వేయడానికి, కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకోవడానికి గ్రామ మార్కెట్‌లో కిలో ఆపిల్‌ రూ.150 చొప్పున విక్రయించాడు. కస్టమర్లు పండ్ల నాణ్యతను ఇష్టపడుతున్నారని తెలుసుకున్నాడు. దీంతో తోటను ఎకరానికి పెంచాడు. పండ్లను వాణిజ్యపరంగా విక్రయించడానికి ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.

Katrina Kaif: చెమటలు పట్టిస్తున్న కత్రినా..! రిహార్సల్‌ చూస్తే ఫిదా కావాల్సిందే.. వీడియో మామూలుగా లేదుగా..

స్యూరుడు అస్తమించని ప్రాంతాలు.. అక్కడ అర్ధరాత్రి అయినా సూర్యుడు కనిపిస్తాడు.. ఎప్పటికీ చీకటి ఉండని దేశాలు ఇవే..

FMGE Exam: చదవాల్సిన అవసరం లేదు.. పూజలతో పరీక్ష పాస్.. మీ ఫ్యూచర్ మార్చేస్తానంటూ బిస్వజిత్‌ ఝా బాబా మోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu