ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వలన ఎన్ని లాభాలో..
samatha
11 april 2025
Credit: Instagram
ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తినడం వలన అది జీర్ణ ఎంజైమ్ లను పెంచేలా చేస్తుందంట. దీంతో జీర్ణక్రియ సాఫీగా సాగడమే కాకుండా గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
బెల్లం కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రోజూ తినడం వలన ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియను బయటకు పంపి, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందంట.
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందువలన దీనిని ప్రతి రోజు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందంట.
బెల్లంలో ఇనుము, ఫోలేట్ ఎక్కువ మొతాదులో ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ కొంచెం తినడం వలన హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడమే కాకుండా, రక్తహీనతను నివారిస్తుందంట.
చాలా మంది పీరియడ్స్ సమయంలో తిమ్మిరి, కడుపు నొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు బెల్లం తినడం చాలా మంచిదంట.
బెల్లం క్రమం తప్పకుండా తినడం వలన రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా, ఇది చర్మనిగారింపుకు దోహదం చేస్తుందంటున్నారు వైద్యులు.
బరువు నియంత్రణలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొవ్వులను పెంచుతుంది.
బెల్లంలో పొటాషియం, కాల్షియం, సోడియం వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తింటే రక్త పోటు సమస్య నుంచి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.