ఆరోగ్యానికి మంచిదని బాదం అధికంగా తింటున్నారా.. జాగ్రత్త!
samatha
10 april 2025
Credit: Instagram
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన ప్రతి రోజూ కనీసం రెండు లేదా మూడు బాదం పప్పులను తినాలని చెబుతుంటారు వైద్యులు
కానీ కొంత మంది బాదం హెల్త్ కి మంచిది కదా అని అధికంగా బాదం పప్పును తింటారు. కానీ ఇలా తినడం అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బాదంప్పును అధికంగా తినడం వలన అనేక సమస్యలు వస్తాయంట. ఇందులో అధిక ఫైబర్ ఉండటం వలన ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు వస్తాయంట.
అలాగే,బాదంప్పులో కేలరీలు అధికంగా ఉంటాయి. అందువలన వీటిని మీరు ఎక్కువగా తీసుకోవడం వలన వేగంగా బరువు పెరుగుతారంట. అందుకే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
బాదంలో విటమిన్ డీ అధికంగా ఉంటుంది. అయితే మంన వీటిని అధికంగా తీసుకోవడం వలన వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తడమే కాకుండా రక్తం గడ్డకట్టే వంటి సమస్యలు కూడా వస్తాయంట.
బాదంప్పులో ఆక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.
కొందరు బాదం పప్పును తింటే అలెర్జీ వంటి సమస్యల బారినపడతారు. అయితే వీటిని అధికంగా తీసుకున్నా కూడా దురద, దుద్దర్లు, లేదా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయంట.
బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కాల్షియం, ఇనుము, జింక్ వంటి ఖనిజాల శోషణకు బాదం ఆటంకం కలిగిస్తుందంట.