ఆహా ఏం రుచి.. వేసవిలో తాటి ముంజలు తింటే ఆనందమే కాదు ఆరోగ్యం కూడా!
samatha
9 april 2025
Credit: Instagram
వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది పల్లెటూర్లకు వెళ్తుంటారు. ఇక అక్కడ స్విమ్మింగ్, మామిడి పండ్లు , ముఖ్యంగా తాటి ముంజలు ఎంతో ఇష్టంగా తింటారు.
ఈ తాటి ముంజలు వేసవిలో మాత్రమే దొరకడంతో చాలా మంది ఎంతో ఇష్టంగా తాటిముంజలు తింటారు. అంతే కాకుండా వీటిని తినడం వలన అనేక లాభాలు కూడా ఉన్నాయంట.
తాటి ముంజల్లో విటమిన్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రైబో ప్లేవిన్, నియాసిస్, బీ - కాంప్లెక్స్ వంటివి అనేకం ఉంటాయి.
అందువలన వీటిని సమ్మర్ లో తినడం వలన ఇవి అనారోగ్య సమస్యల నుంచి కాపాడటమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ డ్ గా ఉంచుతాయి.
అలాగే తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
అంతేకాకుండా డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తాయి. అందువలన ప్రతి ఒక్కరూ తప్పకుండా వేసవిలో దొరికే తాటి ముంజలను తినాలని చెబుతుంటారు.
తాటి ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
అలాగే వీటిని సమ్మర్ లో తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.