ఏంటీ చేపలు తినడం మానేశారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

samatha 

9 april 2025

Credit: Instagram

ఫిష్ కర్రీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా చేపల కూరను వండుకొని తింటుంటారు.

ఇక కొందరు ఫిష్ ప్రై చేసుకుంటే మరికొందరు చేపల పులు చేసుకునొ, ఇంకొందరు ఫిష్ బజ్జీల్లా చేసుకొని తింటుంటారు.

ఇక ఈ చేపలను ఎలా తిన్నా, వీటి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటారు వైద్యులు. ఇందులో మంచి పోషకాలు ఉండటం వలన వీటిని తినడం చాలా మంచిదంట.

అందుకే వీలైనంత ఎక్కువగా చేపలను తినాలని చెబుతారు. తరచూ చేపలను తినడం వలన అనేక లాభాలు ఉన్నాయంట. కాగా, అవి ఏవో తెలుసుకుందాం.

చేపలను తరుచుగా తీసుకోవడం వలన గుండె జబ్బులు రావు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయంట.

చేపల్లో శరీరానికి అవసరమయ్యే మంచి ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, కండరాల బలానికి , ఎముకల బలానికి దోహదం చేస్తాయంట.

చేప‌ల్లో విట‌మిన్ డి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపు చేస్తుంది. ఎముక‌లు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

చేపల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుందంట. అందువలన వీటినికి తరచుగా తినడం వలన కంటి చూపు మెరుగు పడటమే కాకుండా, కంటి సమస్యలను తగ్గిస్తుందంట.