వేసవిలో కీరదోసకాయ జ్యూస్ తాగడం వలన కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
samatha
10 april 2025
Credit: Instagram
వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోత, భానుడి భగ భగలతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతే కాకుండా శరీరం డీహైడ్రేషన్ కుగురికావడం కూడా జరుగుతుంది.
అయితే సమ్మర్ లో శరీరంలోని వేడి తగ్గి, మీ శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహాంగా ఉండాలంటే తప్పనిసరిగా సమ్మర్ లో ప్రతి రోజూ కీర దోసకాయ జ్యూస్ తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వేసవిలో ఈ కీర దోసకాయ జ్యూస్ తాగడం వలన బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంట. మనం అసలు సమ్మర్ లో కీరదోస జ్యూస్ తాగడానికి బెస్ట్ 5 ప్రయోజనాలు తెలుసుకుందాం.
కీరదోసలో ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు, అలాగే అధికంగా నీటి శాతం ఉంటుంది. అందువలన దీనిని మీరు సమ్మర్ లో తాగడం వలన శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుందంట.
దోసకాయలో 90% శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువలన దీనిన జ్యూస్ చేసుకొని ప్రతి రోజూ తాగడం వలన మండే ఎండాకాలంలో మిమ్మల్ని వేడి నుంచి కాపాడటమే కాకుండా హైడ్రేషన్ అందిస్తుంది.
కీర దోసలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ సమ్మేళ్లనాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఈ జ్యూస్ తాగితే అవి మన శరీరంలోని చెడు వ్యర్థాలను బయటకు పంపించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతాయి.
కీరదోస జ్యూస్ లో పేడు ఆరోగ్యానికి తోడ్పడే ఎంజైమ్ లు, ఫైబర్ అధికంగా ఉంది. అందువలన దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చును.
చర్మకాంతిని పెంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులోని పోషకాలు, విటమిన్స్ చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా సహజ నిగారింపును ఇస్తాయి. అందుకే ప్రతి రోజూ కీరదోస జ్యూస్ తాగాలంట.