రాత్రి పూట తప్పని సరిగా తినాల్సిన పండ్లు ఇవే.. తిటే బోలేడు లాభాలు !

samatha 

10 april 2025

Credit: Instagram

రాత్రి సమయంలో పండ్లు తినడం పై చాలా మందికి అనేక డౌట్స్ ఉంటాయి. అసలు నైట్ టైమ్ పండ్లు తినవచ్చా, తినడం వలన ఏవైనా సమస్యలు వస్తాయా అనే డౌట్ ఉంటుంది.

అయితే దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే? రాత్రి పూట తప్పనిసరిగా పండ్లు తినాలంటున్నారు వారు. ఎందుకంటే పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.

అంతేకాకుండా,  రాత్రి సమయంలో పండ్లు తినడం వలన అవి జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా కండరాలను బలంగా తయారు చేస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

అలాగే, పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన వీటిని పడుకునే ముందు తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు

అంతే కాకుండా తేలికపాటి  చిరు తిండిలా ఉంటుందంట. దీని వలన కడుపు నిండుగా ఉండి రాత్రి నిద్ర బాగా పండుతుందంట. అందుకే ప్రతి రోజూ తప్పకుండా పండ్లు తినాలి.

రాతి సమయంలో పైనాపిల్, బొప్పాయి తినడం చాలా మంచిదంట. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా, జీర్ణక్రియ సాఫీగా సాగేలా సహాయపడే ఎంజైమ్ లను ప్రేరేపిస్తాయంట.

రాత్రి సమయంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిదంట. ఎందుకంటే? రాత్రి సమయంలో మనం ఎక్కువగా వాటర్ తాగం కాబట్టి నీటి శాతం ఉన్న పండ్లను తీసుకోవడం వలన అవి మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయంట.

అరటి పండ్లను కూడా రాత్రి పడుకోవడానికి ముదు 9 గంటల లోపు తీసుకోవాలంట. దీని వలన అవి కండరాలను బలంగా ఉంచేదుకు, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయంట.