Viral Video: పుక్కెడికి పోసినట్టున్నరు పొట్టవలిగ తాగిండు… ఆపై మెట్రోలకొచ్చి…
మెట్రోరైల్ స్టేషన్లను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులదే కాదు, మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులది కూడా. ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్‌లో పూటుగా తాగిన వ్యక్తి వాంతి చేసుకున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి...

మెట్రోరైల్ స్టేషన్లను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులదే కాదు, మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులది కూడా. ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్‌లో పూటుగా తాగిన వ్యక్తి వాంతి చేసుకున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి వాంతి చేసుకున్నాడని, “నువ్వు నిన్ను నువ్వు నియంత్రించుకోలేకపోతే ఎందుకు అంతగా తాగుతావు?” అని వీడియో తీస్తున్న వ్యక్తి అడగడం చూడవచ్చు.
ఈ వీడియోను Xలో షేర్ చేశారు. “ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్‌లో తాగిన వ్యక్తికి, కెమెరా వ్యక్తికి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఆ వీడియో పట్ల నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను తాగి ఉన్నాడు, ఎవరు ఏం చెప్పినా అతనికి అర్థం కాలేదు అని రాశారు. ఢిల్లీ మెట్రో అంతా దీని గురించే చర్చ అని కామెంట్స్ చేశారు. ఈ సంఘటనను చిత్రీకరించిన వ్యక్తిని మరికొంత మంది నెటిజన్స్ ప్రశంసించారు. దేశంలోని ప్రతి పౌరుడి నుండి ఆశించేది ఇదే. కెమెరా వ్యక్తికి ధన్యవాదాలు అని రాశారు.
వీడియో చూడండి:
Kalesh b/w a Drunk guy and Camera guy over this drunk guy puked at Preet Vihar Metro Station pic.twitter.com/Djx3YQathA
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 10, 2025