దుప్పితో సెల్ఫీ.. మామూలుగా ఉండదుమరి వీడియో
జంతుప్రేమికులు వాటిని చూసేందుకు సఫారీలకు వెళ్తుంటారు. అక్కడ ఉండే జంతువులకు.. సందర్శకులు రావడం ఫోటోలు వీడియోలు తీసుకోవడం అలవాటే. పులులు, సింహాలు లాంటి క్రూర మృగాలు కూడా సందర్శకులకు ఎలాంటి హానీ తపపెట్టకుండా సందడి చేస్తుంటాయి. ఒక్కోసారి వాటికి కోపం వస్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తాయి. అలాంటి ఎన్నో వీడియోలు మనం నెట్టింట చూశాం. తాజాగా ఓ దుప్పికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. అడవిలో సఫారీకి వెళ్లిన ఓ యువతికి పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన జింక ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే జింక భలే బావుంది.. ఓ సెల్ఫీ దిగుదాం అనుకుని దాని దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగేందుకు రెడీ అయింది. ఆ జింక కూడా సరేలే సెల్ఫీనే కదా తీసుకో అన్నట్టుగా ఫోజిచ్చింది. సెల్ఫీ దిగిన తర్వాత యువతి జింకకు థాంక్స్ చెబుతూ చెయ్యి జింక ముందుకు చాపింది. ఆ జింక కూడా తనదైనశైలిలో కొమ్ములతో అలా యువతి చేతిపై ఒక్కటి కొట్టింది. దెబ్బకు భయపడిన యువతి అక్కడినుంచి పరుగెత్తింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను 34 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

