AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ముంబై ఇండియన్స్ ఆటగాడిపై ఏడాదిపాటు నిషేధం.. ఎందుకో తెలుసా?

Mumbai Indians Player: ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ క్రమంలో ఓ కీలక వార్త బయటకు వచ్చింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కార్బిన్ బాష్‌పై ఒక సంవత్సరం పాటు నిషేధం పడింది. ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు ఏం చేశాడు, అసలు ఎందుకు నిషేధం ఎదుర్కొంటున్నాడో ఇప్పుడు చూద్దాం..

IPL 2025: ముంబై ఇండియన్స్ ఆటగాడిపై ఏడాదిపాటు నిషేధం.. ఎందుకో తెలుసా?
Mumbai Indians
Venkata Chari
|

Updated on: Apr 12, 2025 | 6:59 AM

Share

ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కార్బిన్ బాష్‌పై పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొనకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది. కార్బిన్ బాష్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI)తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో పాల్గొనడానికి కార్బిన్ బాష్ తన పేరును పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కార్బిన్ బాష్ పై చర్య తీసుకుంది. ఈ క్రమంలో అతనిపై 1 సంవత్సరం నిషేధం విధించింది.

ముంబై ఇండియన్స్ ఆటగాడిపై పీసీబీ నిషేధం..

ఈ ఏడాది జనవరిలో జరిగిన పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో 30 ఏళ్ల కార్బిన్ బాష్‌ను పెషావర్ జల్మి డైమండ్ విభాగంలో ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ 2025లో గాయపడిన లిజాద్ విలియమ్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ అతన్ని ఎంపిక చేసింది. దీని కారణంగా అతను టోర్నమెంట్ ప్రారంభానికి కొన్ని వారాల ముందు PSL నుంచి నిష్క్రమించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కోపంగా ఉంది. కార్బిన్ బాష్‌పై ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది.

క్షమాపణలు చెప్పిన కార్బిన్ బాష్..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై కార్బిన్ బాష్ స్పందిస్తూ, ‘పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నుంచి వైదొలగాలనే నిర్ణయానికి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. పాకిస్తాన్ ప్రజలకు, పెషావర్ జల్మి అభిమానులకు, క్రికెట్ ఫ్యాన్స్‌కు నేను క్షమాపణలు చెబుతున్నాను. PSL ఒక ప్రతిష్టాత్మక టోర్నమెంట్. నా చర్యలు నిరాశను కలిగిస్తాయని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. పెషావర్ జల్మి అభిమానులను నిరాశపరిచినందుకు నాకు నిజంగా బాధగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

పీఎస్‌ఎల్‌కు తిరిగి వస్తాను..

‘నా చర్యలకు నేను పూర్తి బాధ్యత వహిస్తాను. పరిణామాలను అంగీకరిస్తున్నాను. ఇందులో జరిమానాతోపాటు, పీఎస్‌ఎల్ నుంచి ఒక సంవత్సరం నిషేధం ఉన్నాయి’ అంటూ కార్బిన్ బాష్ తెలిపాడు. ‘ఇది కఠినమైన పాఠం. కానీ, ఈ అనుభవం నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. భవిష్యత్తులో కొత్త అంకితభావంతోపాటు అభిమానుల కోసం PSLకి తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అంటూ ముగించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ చేయండి..

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?