Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghibli: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. సంతోషించేలోపే ఎన్నో సమస్యలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. త్వరలో మనిషిని రీప్లేస్‌ చేయబోతోంది. సంతోషం. కాని, మనమెవరం ఊహించని దారుణాలు కూడా చేయబోతోందే.. దానికేం చేయడం..? సపోజ్.. ఒక మ్యూజిక్‌ డైరెక్టర్.. వంద మంది కళాకారులతో ఓ సౌండ్‌ క్రియేట్‌ చేస్తాడు. కనీసం 20, 30 ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ఉపయోగించి మైండ్‌ బ్లోయింగ్‌ సంగీతాన్ని సృష్టిస్తాడు. దాన్ని క్రియేట్‌ చేయడానికి ఆయన పడిన కష్టం కొన్ని వారాలు లేదా నెలలు కావొచ్చు. కాని, అలాంటి మ్యూజిక్‌నే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్షణాల్లో క్రియేట్ చేస్తోంది. ఆ సౌండ్‌ విన్నాక.. వావ్, సూపర్ అంటూ మనమంతా క్లాప్స్‌ కొట్టి, హ్యాట్సాఫ్‌ చెబుతాం. ఎంతైనా ఏఐ ఏఐనే అని పొగుడుతాం. ఆ టైమ్‌లో.. ఒక్కసారి తల తిప్పి ఆ మ్యుజీషియన్‌ వైపు చూడండి. సంగీతం నేర్చుకోడానికి ఆయన పడిన కష్టం, తపన ఏమైపోవాలి. చిన్నప్పటి నుంచి సాధన చేసి, గురువుల దగ్గర విద్య నేర్చుకుని, తన ప్రతిభను ప్రదర్శించడానికి ఎన్నో కష్టాలు పడితే.. ఏఐ మాత్రం ఆ కష్టాన్నంతా బూడిదపాలు చేసినట్టు అనిపించడం లేదూ..! ఒక మ్యుజీషియన్ వారాల పాటు తానొక్కడే కష్టపడి ఓ వందమంది కళాకారులకు జీవితాన్ని ఇస్తున్నాడు. అదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కారణంగా భూస్థాపితం కావడం లేదా..!

Ghibli: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. సంతోషించేలోపే ఎన్నో సమస్యలు
Ghibli Art
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 11, 2025 | 10:07 PM

ఇక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి. ఎవరి వర్షన్ వారిదే. ఎవరో కష్టం బూడిదపాలు అవుతోందని టెక్నాలజీని వద్దంటామా అని కొందరు. టెక్నాలజీని స్వీకరిద్దాం.. బట్‌ ఎట్‌ వాట్‌ కాస్ట్ అని మరికొందరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గిబ్లీ ట్రెండ్‌ నడుస్తోంది. జస్ట్ ఫొటో అప్‌లోడ్‌ చేస్తే చాలు.. వెంటనే గిబ్లీ ఇమేజ్ డౌన్‌లోడ్‌ అయిపోతోంది. కాని, ఈ గిబ్లీ చరిత్ర ఏంటో తెలుసా మీకు. ఎంతమంది, ఎన్నాళ్లు, ఎంత కష్టపడితే గిబ్లీ ఆర్ట్‌ తయారవుతుందో తెలుసా. ఆ కళకు ప్రాణం పోసిన వ్యక్తి గురించి, ఆయన వల్ల ఉపాధి పొందుతున్న వందల మంది పరిస్థితి ఏం కాబోతోందో ఆలోచించారా ఎవరైనా? సరే.. ఆయన కష్టాన్ని పక్కనపెట్టండి. గిబ్లీ వల్ల మీ పర్సనల్‌ లైఫ్‌ ఎంత ప్రమాదంలో పడుతోందో ఆలోచించారా. ప్రతి ఒక్క మూమెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తూ, గిబ్లీలు క్రియేట్‌ చేస్తూ, మరొకరికి షేర్‌ చేసుకుంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు గానీ.. దానివెనకున్న ప్రమాదాన్ని ఊహించారా ఎవరైనా? గిబ్లీ ఇమేజెస్ ఈ ప్రపంచాన్ని ఎంత ప్రమాదంలోకి నెడుతోందో తెలుసుకుంటే.. ఇంకోసారి ఆ పేరే ఎత్తరు? అదొక్కటే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయబోతున్న వినాశనాన్ని కూడా తెలుసుకోవాలిక్కడ. ఆ ప్రయత్నమే చేద్దాం ఇవాళ్టి ఎక్స్‌క్లూజివ్‌లో. శామ్‌ ఆల్ట్‌మన్‌. ఈయనెవరో తెలుసుకునే ముందు ఎక్స్‌లో ఈయన పెట్టిన రిక్వెస్ట్‌ చూద్దాం. ‘ప్లీజ్‌ చిల్’.. మా టీమ్‌కు కూడా నిద్ర కావాలి కదా.. దయచేసి గిబ్లీలకు బ్రేక్‌ ఇవ్వండి’ అని వేడుకున్నాడు. ఎందుకంటే.....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి