హనుమాన్ జయంతి రోజున చేయకూడని పనులు ఇవే!
samatha
11 april 2025
Credit: Instagram
ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి. ఈ రోజు ఆంజనేయ స్వామి వారి భక్తులందరూ ఎంతో శ్రద్దగా హనుమంతుడిని పూజిస్తారు.
శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి జయంతిని భారత దేశం అంతటా హిందువులు చాలా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.
అంతే కాకుండా ఉదయాన్నే దగ్గరిలోని హనుమాన్ దేవాలయాలకు వెళ్లి ఆంజనేయస్వామిని దర్శిస్తారు. కొందరు ఈ రో
జు ఉపవాసాలు ఉంటూ స్వామి వారిని పూజిస్తుంటారు.
అంతే కాకుండా హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇంత గొప్ప రోజున అస్సలే కొన్ని పనులు చేయకూడదంట. అవి ఏవి అంటే?
హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులు, దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి. దీని వలన శుభాలు కలుగుతాయి.
హనుమాన్ జయంతి రోజున తామసిక ఆహారం తినకూడదు. అదే విధంగా హనుమాన్ జయంతి రోజున, ఏ జంతువునూ ఇబ్బంది పెట్టకూడదు.లేదా హాని
చేయకూడదు.
హనుమాన్ జయంతి రోజున మధ్యం లేదా మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారితో గొడవలు పెట్టుకోకూడదు
హనుమాన్ జయంతి రోజు మాంసాహార ఆహారం అస్సలే తినకూడదు. దీని వలన ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు పండ
ితులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వేసవిలో కీరదోసకాయ జ్యూస్ తాగడం వలన కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ఆరోగ్యానికి మంచిదని బాదం అధికంగా తింటున్నారా.. జాగ్రత్త!
రాత్రి పూట తప్పని సరిగా తినాల్సిన పండ్లు ఇవే.. తిటే బోలేడు లాభాలు !