మంది ప్రయాణికులతో గాల్లో విమానం.. క్షణాల్లో..వీడియో
225 మంది ప్రయాణికులతో గాల్లో ఎగురుతోంది ఓ విమానం. ఓ ప్రయాణికుడు బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడ అతనికి ఓ లెటర్ కనిపించింది. ఏమై ఉంటుందా అని దాన్ని తీసి చూశాడు. అంతే ఒక్కసారిగా అతని గుండెజారినంతపనైంది. వెంటనే ఒక్క ఉదుటన వాష్‌రూమ్‌నుంచి బయటపడ్డాడు. విమాన సిబ్బంది దగ్గరకు వెళ్లి విషయం చెప్పి అప్రమత్తం చేశాడు. అలర్టయిన విమాన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని లోకోపైలట్‌కు సూచించారు. వెంటనే ఆయన విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
నివేదిక ప్రకారం, ఇండిగో విమానం ఏప్రిల్ 7న జైపూర్ విమానాశ్రయం నుండి ముంబైకి బయలుదేరినట్లు పోలీసులు వివరించారు. విమానం గాల్లో ఉండగా టాయిలెట్‌కు వెళ్లిన వ్యక్తి అక్కడ ఒక నోట్ చూశాడు. ఆ నోట్ పై విమానం లోపల బాంబు ఉందని, అది కొద్ది నిమిషాల్లో పేలిపోతుందని రాసి ఉంది. బాంబు మీ కోసం వేచి ఉంది..ఇది జోక్ కాదు అని రాసి ఉండటంతో ఆ వ్యక్తి ఆ నోట్‌ను సిబ్బందికి చూపించాడు. దాంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ విమానం గట్టి భద్రత మధ్య విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రోటోకాల్ ప్రకారం, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఎమర్జెన్సీ డోర్ నుండి 225 మంది ప్రయాణికులను కిందకు దింపేశారు. విమానంలోని ప్రతి మూలను క్షుణ్ణంగా వెతికారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనను ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది. విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
