ఇన్ స్టా రీల్స్ తో పాపులర్ .. ఇప్పుడు హీరోయిన్ గా బిజీ.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

Rajeev 

11 April 2025

Credit: Instagram

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ చాలా మంది ఇప్పుడు టీవీలు, సినిమాలు, సీరియల్స్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. 

ఇప్పటికే చాలా మంది ఇలా సోషల్ మీడియా పుణ్యమాని పాపులర్ అవుతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. 

సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? 

దీపికా పిల్లి  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయ్యి.. ఇప్పుడు నటి, యాంకర్ గా రాణిస్తుంది.

దీపికా మొదట సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా టిక్‌టాక్‌లో చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది.

ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ తో యువతలో బాగా పాపులర్ అయింది. ఆతర్వాత టీవీషోల్లోకి అడుగుపెట్టింది. 

సినిమా రంగంలో కూడా దీపికా అదృష్టాన్ని పరీక్షించుకుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి "వాంటెడ్ పండుగాడు"చిత్రంలో నటించింది.

ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు సరసన "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" అనే చిత్రంలో నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.