సమంత రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే.. కారణాలు అవే..
Phani CH
10 April 2025
Credit: Instagram
సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2010లో "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
మొదటి సినిమా అయిన ఏ మాయ చేసావే తో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డు వచ్చింది. ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.
ఇది ఇలా ఉంటే సమంత రకరకాల కారణాల వల్ల కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను వదలులుకోవలసి వచ్చింది.
సమంత మిస్ అయిన సినిమాల్లో రీసెంట్ బ్లాక్ బస్టర్ ఒకటి. ఆ సమయం లో సమంత విడాకులు తీసుకుని ఎంతో బాధలో ఉండడం తో ఈ సినిమా చేయలేదట.
మరొక సినిమా నాని హీరోగా నటించిన నిను కోరి. ఈ సినిమా కు సమంత ను హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారట దర్శకుడు. అయితే ఆ సమయం లో సమంత తన పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా మిస్ చేసుకుంది.
ఇక తమిళ్ లో భారీ బడ్జెట్ తో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ఐ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని అడిగారట.
ఈ సినిమాకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.. అయితే కొన్ని కారణాల వల్ల సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందట. దాంతో ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా తీసుకున్నారు.