Mukesh Ambani: ముఖేష్ అంబానీ అరుదైన ఘనత.. ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 06, 2021 | 1:34 PM

Reliance Industries: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన ఘనత దక్కించుకునున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో టాప్‌లో దూసుకెళుతున్న ముకేష్ అంబానీ..సంపాదనలో

Mukesh Ambani: ముఖేష్ అంబానీ అరుదైన ఘనత.. ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి..
Mukesh Ambani

Reliance Industries: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన ఘనత దక్కించుకునున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో టాప్‌లో దూసుకెళుతున్న ముకేష్ అంబానీ..సంపాదనలో వంద బిలియన్ డాలర్లకు చేరువయ్యారు. ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా, ఆసియలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలోకి చేరి మరో కీర్తిని గడించారు. ఆయన సంపాదన వంద బిలియన్ డాలర్లు అంటే పదివేల కోట్లకు చేరువయింది. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రియలన్స్‌ షేర్‌ వ్యాల్యూ శుక్రవారం ఒక్క రోజే 4 శాతం పెరుగడంతో ఆస్థుల విలువ అమాంతంగా పెరిగింది. ఒక్కరోజే అంబానీ ఆస్థుల నికర విలువ 3.71 బిలియన్ డాలర్లు డాలర్లకు పెరిగింది. ఈ ఏడాదిలో ముఖేష్ ఆస్థుల నికర విలువ 15.9 బిలియన్ డాలర్లు పెరిగింది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అంబానీ ఆస్థుల విలువ ప్రస్తుతం 92.6 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ముఖేష్ అంబానీ.. 92 బిలియన్‌ డాలర్లతో వరల్డ్‌ వైడ్‌ బిలియనీర్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ధనికుల జాబితాలో ముఖేష్ అంబానీ12వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ 103 బిలియన్‌ డాలర్లతో 10వ స్థానంలో నిలవగా.. 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్‌ సంస్థ లోరియల్‌ వారసురాలు బెటెన్‌కోర్ట్ మేయరన్‌ ఉన్నారు.

కాగా.. దేశీయ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) దిశగా అడుగులు వేసింది. దీంతోపాటు లోకల్‌ సెర్చ్ ఇంజిన్‌ జస్ట్‌ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలతో.. జస్ట్ డయల్ లిమిటెడ్ వాటాలను రిలయన్స్ కొనుగోలు చేసింది. దీంతో నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజీలో 4.5 శాతానికి పెరిగి జీవితకాల గరిష్ట స్థాయిల్ని రియలన్స్‌ షేర్లు తాకాయి. దీంతో రిలయన్స్ షేర్లు రూ.2,389.65 వద్ద ముగిశాయి. అయితే.. ‘గ్రీన్‌ ఎనర్జీ’ ద్వారా 100 గిగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని ముఖేష్‌ అంబానీ ప్రకటించిన అనంతరం షేర్లు అమాంత పెరిగినట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్‌ కు కలిసొచ్చిన ప్రకటనలు

టాప్ సంపన్నుల జాబితా 1. జెఫ్ బెజోస్ – 200.7 డాలర్లు 2. ఎలన్ మస్క్ 198.9 డాలర్లు 3. బెర్నార్డ్ అర్నాల్ట్ 163.6 డాలర్లు 4. బిల్ గేట్స్ 153.6 డాలర్లు 5. మార్క్ జుకర్ బర్గ్ 139.8 డాలర్లు 6. ల్యారీ పేజ్ 128.1 డాలర్లు 7. సెర్గే బ్రిన్ 123.6 డాలర్లు 8. స్టీవ్ బాల్ మర్ 107.6 డాలర్లు 9. ల్యారీ ఎలిసన్ 103.8 డాలర్లు 10. వారెన్ బఫెట్ 102.6 డాలర్లు 11. ఫ్రాకోయిస్ బెటెన్ కౌంట మేయర్స్-92.9 డాలర్లు 12. ముఖేష్ అంబానీ -92.6 డాలర్లు

Also Read:

Titanic Ship: టైటానిక్‌ షిప్ లైఫ్‌ మరో 12 ఏళ్లే..! ఆ తర్వాత కనుమరుగే.. ఎందుకో తెలుసా..

Triangle Love Story: ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu