Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England 2021 Highlights: ముగిసిన నాలుగో రోజు ఆట.. ధీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్.. విజయానికి 291 పరుగులు

Venkata Chari

| Edited By: Subhash Goud

Updated on: Sep 05, 2021 | 11:43 PM

India vs England 2021: నాలుగో టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగించేలా కనిపిస్తోంది. భారత్‌కు నేడు చాలా కీలకమైన రోజు.

India vs England 2021 Highlights: ముగిసిన నాలుగో రోజు ఆట.. ధీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్.. విజయానికి 291 పరుగులు
Teamindia

India vs England 2021: ఇంగ్లండ్ టీం సింగిల్స్‌తో తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. 12 ఓవర్లలో కేవలం రెండు ఫోర్లు మాత్రమే చేసి, సింగిల్స్, డబుల్స్‌తో పరుగులు తీస్తూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇంగ్లండ్ టీం స్కోర్ 30/0, హమీద్ 12, రోర్నీ 16 క్రీజులో ఉన్నారు.

టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి 368 పరుగులు చేయాల్సి ఉంటుంది.

టీ బ్రేక్ తరువాత బుమ్రా రూపంలో టీమిండియా 450 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై 350 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 445 పరుగులు చేసింది. బుమ్రా 19, యాదవ్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు. దీంతో ఇంగ్లండ్‌పై 346 ఆధిక్యంతో కొనసాగుతోంది.

టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ అలీ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదేశాడు. టీమిండియా స్కోర్ 425/8, యాదవ్ 10, బుమ్రా 1 క్రీజులో ఉన్నారు.

టీమిండియా కీపర్ రిషబ్ పంత్(50) అర్థ సెంచరీ పూర్తి చేశాక వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో 414 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. వరుసగా శార్దుల్, పంత్ వికెట్లను భారత్ కోల్పోయింది.

టీమిండియా శార్దుల్(60) రూపంలో ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కానిది కెప్టెన్ జో రూట్ సాధించాడు. జో రూట్ బౌలింగ్‌లో క్రైగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోర్ 4127, పంత్ 49, యాదవ్ 0 క్రీజులో ఉన్నారు.

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 400 పరుగులు దాటింది. ఈ సిరీస్‌లో తొలిసారిగా 400 పరుగులు దాటింది. పంత్ 47, శార్దుల్ 56 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్‌ను సాధించింది. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 406 పరుగులు సాధించింది. అలాగే ఇంగ్లండ్‌పై 300 పరుగుల ఆధిక్యం సంపాధించింది.

టీమిండియా బ్యాట్స్‌మెన్ శార్డుల్ ఠాకూర్ వరుసగా తన రెండో అర్థ సెంచరీని పూర్తి చేశాడు. 65 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో నాలుగో టెస్టులో తన రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీమిండియాకు కీలకమైన పరుగులు అందించాడు.

రాబిన్ సన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన శార్దుల్ 49 పరుగులను చేరుకున్నాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దీంతో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 394 పరుగులు సాధించింది. పంత్ 42, శార్దుల్ 49 పరుగలతో క్రీజులో నిలిచారు.

శార్దుల్(29), పంత్‌(32) ఇద్దరూ కలిసి 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని సాధించారు. దీంతో టీమిండియా ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద నిలిచింది. అలాగే ఇంగ్లండ్ టీంపై 264 పరుగుల ఆధిక్యం సంపాధించింది.

నాలుగో రోజు లంచ్ సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే జడేజా(17), రహానె(0), కోహ్లీ(44)త్వరగా పెవలియన్ చేరారు. పంత్(16), శార్దుల్(11) ఇద్దరూ ఆడితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్118 ఓవర్లకు 329/6 గా ఉంది.

టీమిండియా స్కోర్ బోర్డులో పరుగులు వచ్చి చేరుతున్నాయి. ఓ వైపు రిషభ్ పంత్ ఆచి తూచి ఆడుతూ సింగిల్స్ తీస్తుంటే.. మరోవైపు శార్దుల్ మాత్రం ప్రతీ ఓవర్లలో బౌండరీ బాదేందుకు ప్రయత్నిస్తున్నాడు. వరుస ఓవర్లలో ఫోర్లు బాదేస్తూ స్కోర్ బోర్డును పరగులు పెట్టేస్తున్నాడు. టీమిండియా స్కోర్ 329/6, పంత్ 16, శార్దుల్ 11 క్రీజులో ఉన్నారు.

టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. 312 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. హాఫ్ సెంచరీ చేయకుండానే కోహ్లీ ఔటయ్యాడు.

ఇంగ్లండ్‌పై టీమిండియా ఆధిక్యం 200 పరుగులకు చేరింది. ప్రస్తుతం భారత్ 299/5 వద్ద ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

నాలుగో రోజు టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. రహానె వోక్సో బౌలింగ్‌లో ఎల్బీగా పెవలియన్ చేరాడు. టీమిండియా స్కోర్ 296/5, కోహ్లీ (40) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 

భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోన్న టీమిండియాకు షాక్ తగిలింది. రవీంద్ర జడేజా(17) వోక్సో బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 296 పరుగుల వద్ద భారత్ 4 వ వికెట్‌ను కోల్పోయింది. టీమిండియా స్కోర్ 296/4, కోహ్లీ 40, రహానె 0 క్రీజులో ఉన్నారు.

భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో 4వ టెస్ట్ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్‌లో భాగంగా మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 22 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులతో ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ(127) విదేశాల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ 46, పుజారా 61 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌పై 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్స్ సన్ 2 వికెట్లు, అండర్సన్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ టీం 290 పరుగులకు ఆలౌట్ అయింది. పోప్ 81 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. వోక్స్ 50, బెయిర్ స్టో 37, మలాన్ 31, అలీ 35 పరుగులతో నిలిచారు. ఉమేష్ యాదవ్ 3, బుమ్రా 2, జడేజా 2, ఠాకూర్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియాపై 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Sep 2021 11:37 PM (IST)

    ధీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్.. విజయానికి 291 పరుగులు

    ఇంగ్లాండ్‌ రెండో ఇన్సింగ్స్‌లో శుభారంభం చేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 77 పరుగులతో వికెట్‌ నష్టపోకుండా నిలిచింది. అయితే చివరి రోజు ఇంగ్లాండ్‌ విజయానికి 291 పరుగు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు హమీద్‌ 43 పరుగులు, రోర్ని 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే పది వికెట్లు తీయాల్సి ఉంటుంది. అంతకు ముందు భారత్‌ 466 పరుగులకు అలౌట్‌ అయిన విషయం తెలిసిందే.

  • 05 Sep 2021 09:57 PM (IST)

    జిడ్డు బ్యాటింగ్‌ మొదలెట్టిన ఇంగ్లండ్

    ఇంగ్లండ్ టీం సింగిల్స్‌తో తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. 12 ఓవర్లలో కేవలం రెండు ఫోర్లు మాత్రమే చేసి, సింగిల్స్, డబుల్స్‌తో పరుగులు తీస్తూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు.

    ఇంగ్లండ్ టీం స్కోర్ 30/0, హమీద్ 12, రోర్నీ 16

  • 05 Sep 2021 09:11 PM (IST)

    మొదలైన ఇంగ్లండ్ బ్యాటింగ్

    జోరూట్ సేన రెండో ఇన్నింగ్స్ మొదలైంది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ గెలవాలంటే 368 పరుగులు చేయాల్సి ఉంది.

  • 05 Sep 2021 08:55 PM (IST)

    466 పరుగులకు టీమిండియా ఆలౌట్

    టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి 368 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  • 05 Sep 2021 08:52 PM (IST)

    రెండో సిక్స్ బాదిన యాదవ్

    ఉమేష్ యాదవ్ రెండో సిక్స్‌ను అవలీలగా బాదేశాడు. వోక్స్ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన ఉమేష్.. 22 బంతుల్లో 2 సిక్సులు, 1 ఫోర్‌తో 25 పరుగులతో నిలిచాడు.

  • 05 Sep 2021 08:45 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్..

    టీ బ్రేక్ తరువాత బుమ్రా రూపంలో టీమిండియా 450 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై 350 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 05 Sep 2021 08:17 PM (IST)

    టీ బ్రేక్

    టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 445 పరుగులు చేసింది. బుమ్రా 19, యాదవ్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు. దీంతో ఇంగ్లండ్‌పై 346 ఆధిక్యంతో కొనసాగుతోంది.

  • 05 Sep 2021 07:57 PM (IST)

    సిక్స్ కొట్టిన యాదవ్

    టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ అలీ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదేశాడు.

    టీమిండియా స్కోర్ 425/8, యాదవ్ 10, బుమ్రా 1

  • 05 Sep 2021 07:50 PM (IST)

    పంత్ ఔట్

    టీమిండియా కీపర్ రిషబ్ పంత్(50) అర్థ సెంచరీ పూర్తి చేశాక వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో 414 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. వరుసగా శార్దుల్, పంత్ వికెట్లను భారత్ కోల్పోయింది.

  • 05 Sep 2021 07:47 PM (IST)

    పంత్ హాఫ్ సెంచరీ

    టీమిండియా  కీపర్ రిషబ్ పంత్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

  • 05 Sep 2021 07:46 PM (IST)

    శార్దుల్ ఔట్

    టీమిండియా శార్దుల్(60) రూపంలో ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కానిది కెప్టెన్ జో రూట్ సాధించాడు. జో రూట్ బౌలింగ్‌లో క్రైగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

    టీమిండియా స్కోర్ 4127, పంత్ 49, యాదవ్ 0 

  • 05 Sep 2021 07:37 PM (IST)

    400 దాటిన టీమిండియా స్కోర్

    నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 400 పరుగులు దాటింది. ఈ సిరీస్‌లో తొలిసారిగా 400 పరుగులు దాటింది. పంత్ 47, శార్దుల్ 56 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్‌ను సాధించింది. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 406 పరుగులు సాధించింది. అలాగే ఇంగ్లండ్‌పై 300 పరుగుల ఆధిక్యం సంపాధించింది.

  • 05 Sep 2021 07:32 PM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన శార్దుల్

    టీమిండియా బ్యాట్స్‌మెన్ శార్డుల్ ఠాకూర్ వరుసగా తన రెండో అర్థ సెంచరీని పూర్తి చేశాడు. 65 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో నాలుగో టెస్టులో తన రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీమిండియాకు కీలకమైన పరుగులు అందించాడు.

  • 05 Sep 2021 07:29 PM (IST)

    సిక్స్ బాదిన శార్దుల్

    రాబిన్ సన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన శార్దుల్ 49 పరుగులను చేరుకున్నాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దీంతో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 394 పరుగులు సాధించింది. పంత్ 42, శార్దుల్ 49 పరుగలతో క్రీజులో నిలిచారు.

  • 05 Sep 2021 05:41 PM (IST)

    లంచ్ బ్రేక్

    నాలుగో రోజు లంచ్ సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే జడేజా(17), రహానె(0), కోహ్లీ(44)త్వరగా పెవలియన్ చేరారు. పంత్(16), శార్దుల్(11) ఇద్దరూ ఆడితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్118 ఓవర్లకు 329/6 గా ఉంది.

  • 05 Sep 2021 05:35 PM (IST)

    ఫోర్లతో స్కోర్ బోర్డు పెంచేస్తున్న శార్దుల్

    టీమిండియా స్కోర్ బోర్డులో పరుగులు వచ్చి చేరుతున్నాయి. ఓ వైపు రిషభ్ పంత్ ఆచి తూచి ఆడుతూ సింగిల్స్ తీస్తుంటే.. మరోవైపు శార్దుల్ మాత్రం ప్రతీ ఓవర్లలో బౌండరీ బాదేందుకు ప్రయత్నిస్తున్నాడు. వరుస ఓవర్లలో ఫోర్లు బాదేస్తూ స్కోర్ బోర్డును పరగులు పెట్టేస్తున్నాడు. టీమిండియా స్కోర్ 329/6, పంత్ 16, శార్దుల్ 11

  • 05 Sep 2021 05:07 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్

    టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. 312 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. హాఫ్ సెంచరీ చేయకుండానే కోహ్లీ ఔటయ్యాడు.

  • 05 Sep 2021 04:51 PM (IST)

    200లకు చేరిన ఆధిక్యం

    ఇంగ్లండ్‌పై టీమిండియా ఆధిక్యం 200 పరుగులకు చేరింది. ప్రస్తుతం భారత్ 299/5 వద్ద ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

  • 05 Sep 2021 04:32 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్..

    నాలుగో రోజు టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. రహానె వోక్సో బౌలింగ్‌లో ఎల్బీగా పెవలియన్ చేరాడు. టీమిండియా స్కోర్ 296/5, కోహ్లీ 40

  • 05 Sep 2021 04:23 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

    భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోన్న టీమిండియాకు షాక్ తగిలింది. రవీంద్ర జడేజా(17) వోక్సో బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 296 పరుగుల వద్ద భారత్ 4 వ వికెట్‌ను కోల్పోయింది. టీమిండియా స్కోర్ 296/4, కోహ్లీ 40, రహానె 0

  • 05 Sep 2021 03:24 PM (IST)

    రవిశాస్త్రికి కరోనా

    భారత శిబిరంలో కరోనా కలకలం రేగింది. నిన్న సాయంత్రం ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. రవిశాస్త్రితోపాటు సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు సభ్యులు – బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ కూడా ముందు జాగ్రత్తల కోసం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

Published On - Sep 05,2021 2:51 PM

Follow us