5

IND vs ENG: ఐసోలేషన్‌లో టీమిండియా హెడ్‌కోచ్.. కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ.. మరో ముగ్గురు సభ్యులు కూడా..!

IND vs ENG: భారత శిబిరంలో కరోనా కలకలం రేగింది. నిన్న సాయంత్రం ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

IND vs ENG: ఐసోలేషన్‌లో టీమిండియా హెడ్‌కోచ్.. కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ.. మరో ముగ్గురు సభ్యులు కూడా..!
Ravi Shastri
Follow us

|

Updated on: Sep 05, 2021 | 3:45 PM

IND vs ENG: భారత శిబిరంలో కరోనా కలకలం రేగింది. నిన్న సాయంత్రం ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. రవిశాస్త్రితోపాటు సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు సభ్యులు – బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ కూడా ముందు జాగ్రత్తల కోసం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

వీరు RT-PCR పరీక్ష చేయించుకున్నారు. టీమిండియాలోని ఆటగాళ్లు మొత్తం హోటల్‌లో ఉండనున్నారు. వైద్య బృందం నుంచి ధృవీకరణ వచ్చేవరకు భారత ఆటగాళ్లతో కలిసి ప్రయాణించరు.

టీమిండియా బృందంలోని మిగిలిన సభ్యులు రెండు లాటరల్ ఫ్లో టెస్టులు చేయించుకున్నారు. అయితే వీరికి మాత్రం రిపోర్టుల్లో పాజిటివ్ తేలకపోవడంతో.. ఓవల్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడేందుకు అనుమతించారు.

భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో 4వ టెస్ట్ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్‌లో భాగంగా మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 22 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులతో ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ(127) విదేశాల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ 46, పుజారా 61 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌పై 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్స్ సన్ 2 వికెట్లు, అండర్సన్ 1 వికెట్ పడగొట్టారు.

Also Read:

IND vs ENG 4th Test Day 4 Live: ఓవల్ టెస్టులో పట్టు బిగిస్తోన్న భారత్.. ఇంగ్లండ్‌పై 171 పరుగుల ఆధిక్యం..!

11 ఏళ్ల కెరీర్‌లో 11 వికెట్లు కూడా తీయలేదు.. చెత్త బౌలింగ్‌కు ఇతడే నిదర్శనం.. ఎవరో తెలుసా!

Paralympics: దుమ్ములేపుతున్న భారత్ అథ్లెట్స్.. ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్..

'కుమారి శ్రీమతి' కి సూపర్‌ రెస్పాన్స్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కుమారి శ్రీమతి' కి సూపర్‌ రెస్పాన్స్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మల్లారెడ్డా మజాకా.. మాస్ స్టెప్పులతో చిరంజీవినే డామినేట్ చేశారు..
మల్లారెడ్డా మజాకా.. మాస్ స్టెప్పులతో చిరంజీవినే డామినేట్ చేశారు..
స్టార్స్ కాకముందు ఈ హీరోహీరోయిన్స్ ఏం చేసేవారో తెలుసా ?..
స్టార్స్ కాకముందు ఈ హీరోహీరోయిన్స్ ఏం చేసేవారో తెలుసా ?..
ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం..
ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం..
ప్రపంచకప్‌ కామెంటేటర్ల లిస్టు .. తెలుగులో ఎవరు చెప్పనున్నారంటే?
ప్రపంచకప్‌ కామెంటేటర్ల లిస్టు .. తెలుగులో ఎవరు చెప్పనున్నారంటే?
చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని.. బాధ నుంచి తేరుకుని..
చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని.. బాధ నుంచి తేరుకుని..
జనావాస బాట పట్టిన వన్యమృగాలు.. తిరుమలలో భారీ కొండ చిలువ
జనావాస బాట పట్టిన వన్యమృగాలు.. తిరుమలలో భారీ కొండ చిలువ
చేప చిట్టి పొట్టకి చేపలు, పావుల సహా అన్నీ ఆహారాలే..షాకింగ్ వీడియో
చేప చిట్టి పొట్టకి చేపలు, పావుల సహా అన్నీ ఆహారాలే..షాకింగ్ వీడియో
Team India: విశ్వవిజేతగా రోహిత్ సేన.. ఈ లోపాలను అధిగమిస్తేనే..
Team India: విశ్వవిజేతగా రోహిత్ సేన.. ఈ లోపాలను అధిగమిస్తేనే..
సమస్యల సుడిగుండంలో ‘ఇండియా’ కూటమి.. మోదీని ఢీకొట్టేదెలా?
సమస్యల సుడిగుండంలో ‘ఇండియా’ కూటమి.. మోదీని ఢీకొట్టేదెలా?