Paralympics: దుమ్ములేపుతున్న భారత్ అథ్లెట్స్.. ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్..

Krishna Nagar Gold Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ ఆదరగొడుతున్నారు. ఇదే కోవలో భారత్ ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో కృష్ణ నాగర్ స్వరాన్ని గెలిచాడు.

Paralympics: దుమ్ములేపుతున్న భారత్ అథ్లెట్స్.. ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్..
Krishna Nagar
Follow us

|

Updated on: Sep 05, 2021 | 11:08 AM

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ అదరగొడుతున్నారు. అసాధారణ రీతిలో ప్రదర్శనను కనబరుస్తూ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్‌లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్స్‌లో హాంకాంగ్ ఆటగాడు చుమన్‌పై 21-17, 16-21, 21-17 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈరోజు మెగా క్రీడల్లో భారత్ రెండు పతకాలు సాధించింది. ఈ ఉదయం బ్యాడ్మింటన్ ఎస్ఎల్-4 సుహాస్ యతిరాజ్ రజతం సాధించగా..తాజాగా కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. దీనితో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 19 మెడల్స్ సాధించింది. వీటిల్లో 5 గోల్డ్, 8 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

కాగా, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో భారత అథ్లెట్ సుహాస్.. రజత పతకాన్ని సాధించాడు.  పురుషుల సింగిల్స్‌లో… ఫ్రాన్స్ దేశానికి చెందిన లుకాస్ మజుర్‌తో తలపడిన సుహాస్ ఓటమిపాలయ్యాడు. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో  21-15 17-21 15-21  తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో రజతంతో సరిపెట్టుకున్నాడు సుహాస్.

Also Read: Mileage Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. అదిరిపోయే ఈ 5 బైకులపై ఓ లుక్కేయండి.!