Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Proposal on Track Video: ట్రాక్‌పై లవ్‌.. అంధ అథ్లెట్‌కు ఆమె గైడ్‌ లవ్‌ ప్ర‌పోజల్‌! వీడియో వైరల్‌.

Proposal on Track Video: ట్రాక్‌పై లవ్‌.. అంధ అథ్లెట్‌కు ఆమె గైడ్‌ లవ్‌ ప్ర‌పోజల్‌! వీడియో వైరల్‌.

Anil kumar poka

|

Updated on: Sep 06, 2021 | 9:11 AM

టోక్యోలో పారాలింపిక్స్‌ జరుగుతున్నాయి. అది 200 మీట‌ర్ల పరుగు పందెం. కేప్ వ‌ర్డే దేశానికి చెందిన స్ప్రింట‌ర్ సెమీ ఫైన‌ల్లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. ఎందుకంటే.. ఆమెకు మెడ‌ల్ కంటే గొప్ప బహుమతి లభించింది. దీంతో ఆమె స్వర్ణం గెలిచినంతగా ఆనందపడింది.

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో ఇటీవల ఓ అద్భుతం జరిగింది. రన్నింగ్‌ సెమీ ఫైనల్స్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది అంధ అథ్లెట్‌ పెరీరా. ట్రాక్‌పై నిరాశగా వెనుదిరిగిన ఆమెకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు ఆమె గైడ్‌. ఆమెలో ముందెన్నడూ లేనంత ఉత్సాహం నింపాడు. గైడ్‌ వాజ్ డా వేగా ట్రాక్‌పైనే పెరీరాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు ఒక్కసారిగా అవాక్కయిన పెరీరా.. ఓకే చెప్పడంతో మిగతా అథ్లెట్లతో సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో లవ్‌ బర్డ్స్‌కు విషెస్‌ తెలిపారు. ఈ ట్రాక్‌పై లవ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. ఈ సర్‌ప్రైజ్‌ లవ్‌ ట్రాక్‌ను పారాలింపిక్స్‌ నిర్వాహకులు అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశారు.


మరిన్ని ఇక్కడ చూడండి: Taliban and Afghan Video: క్రికెట్‌పై తాలిబన్లకు మోజు.. స్టేడియంలో అఫ్గాన్ , తాలిబన్ జెండాల సందడి..!(వీడియో)

Face Book: నల్లజాతీయుల్ని ‘కోతులు’ అన్నందుకు ఇరకాటంలో పడ్డ FB ..!(వీడియో).

Delta Variant: కొత్త కరోనా మరింత డేంజర్.. భారత్ లో ఏవై.12 కరోనా.. మొదలైన థర్డ్ వేవ్..(లైవ్ వీడియో).

News Watch: విస్తారంగా వర్షాలు. | 700 మంది తాలిబన్ల హతం | టోక్యోలో రికార్డ్.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..