Face Book: నల్లజాతీయుల్ని ‘కోతులు’ అన్నందుకు ఇరకాటంలో పడ్డ FB ..!(వీడియో).
ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్‌కి చెందిన వీడియో ఒకటి ఈ మధ్య ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నల్ల జాతీయులను ఉద్దేశించి.. ‘ఇలాంటి కోతుల వీడియోలు మరిన్ని కోరుకుంటున్నారా?’ అంటూ యూజర్లను కోరింది ఫేస్‌బుక్. ఇది జాత్యంహాకార వ్యవహారమేనంటూ ఫేస్‌బుక్...
ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్‌కి చెందిన వీడియో ఒకటి ఈ మధ్య ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నల్ల జాతీయులను ఉద్దేశించి.. ‘ఇలాంటి కోతుల వీడియోలు మరిన్ని కోరుకుంటున్నారా?’ అంటూ యూజర్లను కోరింది ఫేస్‌బుక్. ఇది జాత్యంహాకార వ్యవహారమేనంటూ ఫేస్‌బుక్ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు కొందరు. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగిందని, క్షమాపణలు చెప్తున్నాం అని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఆ టాపిక్‌ను డిసెబుల్ చేసింది. అయితే నష్టనివారణ కోసం క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్స్ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు.
ప్రైమేట్స్‌లో కోతులు, చింపాంజీలు, గొరిల్లాతో పాటు మనుషులు కూడా ఉంటారని, బహుశా ఆ ఉద్దేశంతో అలా రికమండేషన్ వచ్చి ఉంటుందని కొందరు టెక్నికల్ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇది జాత్యహంకార వ్యవహారామేనని ఫేస్‌బుక్‌పై దావాకి సిద్ధమవుతున్నారు మనోభావాలు దెబ్బతిన్న కొందరు.
మరిన్ని ఇక్కడ చూడండి: Delta Variant: కొత్త కరోనా మరింత డేంజర్.. భారత్ లో ఏవై.12 కరోనా.. మొదలైన థర్డ్ వేవ్..(లైవ్ వీడియో).
Fake Police In AP: నకిలీ ఎస్సై నకరాలు.. అసలు పోలీసులకుచిక్కి..వీడియో వైరల్.