Bigg Boss 5 Telugu: అప్పుడే బిగ్‏బాస్ హౌస్‏లో డ్రీమ్ గళ్‏ను వెతుక్కునే పనిలో సన్నీ.. ఆ ఇద్దరితో..

బిగ్‏బాస్ 5 తెలుగు : అత్యంత పాపులర్ రియాల్టీ బిగ్‏బాస్ సీజన్ 5 ఘనంగా ప్రారంభమైంది. మాస్, క్లాస్ స్టెప్పులతో కింగ్ నాగార్జున స్టేజ్ పై దుమ్ములేపారు. ప్రమోషన్‏లో భాగంగా..

Bigg Boss 5 Telugu: అప్పుడే బిగ్‏బాస్ హౌస్‏లో డ్రీమ్ గళ్‏ను వెతుక్కునే పనిలో సన్నీ.. ఆ ఇద్దరితో..
Sunnyబిగ్ బాస్ హౌస్‌లోకి సెకండ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు సీరియల్ యాక్టర్, వీజే సన్నీ.. సరైనోడు మూవీ సాంగ్‌కు అదిరిపోయే డాన్స్‌తో ఆకట్టుకున్నాడు సన్నీ.
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2021 | 11:32 AM

బిగ్‏బాస్ 5 తెలుగు : అత్యంత పాపులర్ రియాల్టీ బిగ్‏బాస్ సీజన్ 5 ఘనంగా ప్రారంభమైంది. మాస్, క్లాస్ స్టెప్పులతో కింగ్ నాగార్జున స్టేజ్ పై దుమ్ములేపారు. ప్రమోషన్‏లో భాగంగా.. హౌస్ మొత్తాన్ని చూపించేశాడు నాగ్. ఇక ఆ తర్వాత నాగ్.. బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‏లను ఇంట్లోకి ప్రవేశ పెట్టారు నాగార్జున. అలా మొదటి కంటెస్టెంట్‏గా సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. ఇళ్లంతా తిరిగి.. అన్ని చూసి తెగ మురిసిపోయింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్‏గా వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెరపై కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యాడు సన్నీ. సీరియల్స్‏లో నటిస్తూ.. పక్కింటి అబ్బాయిగా కనిపిస్తావ్ కదా అంటూ ప్రశ్నించాడు నాగ్. ఆ తర్వాత సన్నీని స్టేజ్ మీద బొమ్మ గీయించారు. మెల్లకన్ను, మామిడి పండు అంటూ ఆ బొమ్మ మీద కామెంట్ చేశారు నాగ్.

ఆ తర్వాత ఆ బొమ్మను పట్టుకెళ్లు.. లోపల ఎవరైనా కనిపిస్తే ఇవ్వు అంటూ చెప్పారు నాగ్. ఇక లోపలికి ఎంట్రీ ఇచ్చిన సన్నీ.. అక్కడి అందాలను ముచ్చటపడ్డాడు. ఇక ఆ తర్వాత హౌస్‏లో ఉన్న సిరిని చూసిన సన్నీ.. రావడంతోనే.. తన బొమ్మ గురించి చెబుతూ తెగ ముచ్చట్లు పెట్టేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి బిగ్‏బాస్ ఇంటిని చూసేశారు. జిమ్ ఏరియా అంటూ సన్నీ సిక్స్ ప్యాక్ మీద సిరి కామెంట్ చేసింది. నాది సిక్స్ ప్యాక్ కాదు.. ఫ్యామిలీ ప్యాక్ అంటూ సన్నీ కౌంటర్ వేశాడు. ఇక రేపటి నుంచి కలిసే జిమ్ లో వర్కవుట్స్ చేద్దాం ఉంటూ ముచ్చట్లు పెట్టేశారు.

సన్నీ.. 1989లో ఖమ్మంలో జన్మించాడు. అసలు పేరు అరుణ్ రెడ్డి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్ పూర్తిచేసిన సన్నీకి.. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. చిన్నవయసులోనే అల్లాదీన్ అనే నాటకం వేసి ప్రశంసలు అందుకున్నాడు. జస్ట్ ఫర్ మెన్ టీవీ షోతో యాంకర్‏గా పరిచయమై.. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్‏లో రిపోర్టర్‏గా చేశారు. ఆ తర్వాత వీజేగా మారిపోయారు. ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు సన్నీ. ఆ తర్వాత కళ్యాణ వైభోగం అనే టీవీ సీరియల్ ద్వారా నటుడిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ.. ఈ సీరియల్‏తో ఎక్కువగా పాపులర్ అయ్యారు. అలాగే సకలగుణాభి రామా అనే సినిమాతో వెండితెరకు పరిచయం కానునన్నారు.

Also Read: Ajith: సరిహద్దులు దాటిన ప్రేమ.. స్టార్ హీరో‏పై వీరాభిమానం.. బహుమతులను చూస్తే షాకవ్వాల్సిందే..

Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ