Ajith: సరిహద్దులు దాటిన ప్రేమ.. స్టార్ హీరో‏పై వీరాభిమానం.. బహుమతులను చూస్తే షాకవ్వాల్సిందే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 06, 2021 | 10:25 AM

తమిళ్ స్టార్ అజిత్‎కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట మాత్రమే కాకుండా.. తెలుగులోనూ

Ajith: సరిహద్దులు దాటిన ప్రేమ.. స్టార్ హీరో‏పై వీరాభిమానం.. బహుమతులను చూస్తే షాకవ్వాల్సిందే..
Ajith Hero

తమిళ్ స్టార్ అజిత్‎కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట మాత్రమే కాకుండా.. తెలుగులోనూ అజిత్‏కు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఏరో మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్, బైక్ రేసింగ్ ఇలా అన్నింటిపై అజిత్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమాల నుంచి విరామం దొరికినప్పుడల్లా తన వీటికి సమయం కేటాయిస్తుంటాడు. అజిత్ ఎక్కువగా బైక్ రైడ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇక అజిత్ అభిమానులు తమ అభిమాన హీరో కోసం ఏలాంటి సాహసమైన చేయడానికి సిద్ధపడుతుంటారు. తమ హీరోపై ఉన్న ప్రేమ కొన్ని సందర్భాల్లో ఎల్లలు దాటుతుంది. అయితే అజిత్‏కు దక్షిణాది ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక ఎత్తైతే.. విదేశాల్లోనూ ఈ స్టార్ హీరోకు వీరాభిమానులున్నారు. తాజాగా ఓ రష్యన్ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ ఉప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్ కోసం చిత్రయూనిట్ కొద్ది రోజులు రష్యా వెళ్లింది. అజిత్ పాల్గొన్న అతి పెద్ద బైక్ ఫైట్‌లు మాస్కో సమీపంలోని కొలొమ్నాలో చిత్రీకరించారు. ఎన్నో జాగ్రత్తల మధ్య ఈ షూటింగ్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈ షూట్ పూర్తైన చివరి రోజున రష్యన్ వ్యక్తి అజిత్‏కు బహుమతులను అందించాడు.

Ajith

Ajith

అలెక్స్ అనే వ్యక్తి వాలిమై రష్యాలో చిత్ర బృందానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను రష్యాలో ఈ సినిమాకు సంబంధించి చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు అజిత్‏ను గమనిస్తూనే ఉన్నాడు. అంతే కొన్ని రోజుల్లోనే ఆయనకు ఫ్యాన్ అయిపోయాడు. ఇక షూటింగ్ పూర్తైన తర్వాత అజిత్ కి రెండు టీ షర్టులు, ఒక కప్పు టీ, ఓ ప్రసిద్ధ చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. ఆ షర్ట్ పై అజిత్ ది బెస్ట్ అని రాసుంది. అలాగే కొలొమ్నా మిమ్మల్ని ఇష్టపడుతోంది అని రాసి ఉంది.

Also Read: Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..

Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu