AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..

ట్రెండ్‏ను ఫాలో అవ్వడంలో స్టార్ హీరోహీరోయిన్స్ ముందుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవడమే కాకుండా.

Jr. NTR: తారక్  అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..
Ntr
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2021 | 9:57 AM

Share

ట్రెండ్‏ను ఫాలో అవ్వడంలో స్టార్ హీరోహీరోయిన్స్ ముందుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవడమే కాకుండా.. మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్‏ కొత్త పుంతలను ఫాలో అవుతుంటారు. ఇక టెక్నాలజీ విషయంలో చెప్పాల్సిన పనేలేదు. అలాగే.. స్టార్ హీరోహీరోయిన్లకు బైక్స్, కార్లు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు హీరోలకు కార్లపై ఉండే మోజు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక కార్లను ఇష్టపడడంలో తారక్ ముందుంటారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా కార్లంటే మక్కువ ఎక్కువే. వీరిద్దరూ మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వాళ్ళ కంపౌండ్‌లోకి తెచ్చుకుంటారు.

ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారెజీలో అనేక కార్లు ఉండగా.. ఇటీవల ఎంతో విలాసవంతమైన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కారును మొన్నటికి మొన్న రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రత్యేకంగా ఫారెన్ నుంచి తెప్పించుకున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే తారక్‌ దగ్గర ఉన్న కార్లన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అదేంటి అన్ని కార్లకి ఒకే నంబర్‌ అనుకుంటున్నారా? దీనికి సమాధానంగా తన సన్నిహితులు కొందరు తారక్‌కి ఆ నంబర్‌ అంటే సెంటిమెంట్‌ అని అంటుంటారు. కానీ నిజానికి ఎన్టీఆర్‌కు మాత్రం అలాంటి సెంటిమెంట్స్‌ ఏమీ లేవట. కానీ ఓ ప్రత్యేక కారణం మాత్రం ఉందట. తన తాత నందమూరి తారక రామారావు, తన తండ్రి హరికృష్ట ఇద్దరూ ఆ నెంబర్ వాడడంతో అదే తాను కూడా కంటిన్యూ చేస్తున్నానని ఎన్టీఆర్ తెలిపాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్‌తో పాటు ఎన్టీఆర్ ట్విటర్‌ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్ పోషిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..

Bigg Boss 5 Telugu: హుషారైన మాటలతో.. చలాకీ తనంతో హౌస్‌లో హడావిడి చేసేస్తున్న భామ..