AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinivas Avasarala: నా సినిమా ఆగిపోవడానికి కారణం అదే.. అవసరాల శ్రీనివాస్ ఆసక్తిగా కామెంట్స్..

హీరోగా నటుడిగా, దర్శకుడిగా, రచయితా ఇలా మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు అవసరాల శ్రీనివాస్. నాని నటించిన అష్టాచమ్మా సినిమాతో

Srinivas Avasarala: నా సినిమా ఆగిపోవడానికి కారణం అదే.. అవసరాల శ్రీనివాస్ ఆసక్తిగా కామెంట్స్..
Srinivas Avasarala
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2021 | 10:45 AM

Share

హీరోగా నటుడిగా, దర్శకుడిగా, రచయితా ఇలా మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు అవసరాల శ్రీనివాస్. నాని నటించిన అష్టాచమ్మా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయినశ్రీనివాస్. ఆతర్వాత ఉహలుగుసగుసలాడే, అమీతుమీ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా ఆయన హీరోగా చేసిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా ఈ నెల 3వ తేదీన హియేటర్లకు వచ్చింది. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిచారు. `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ గొత్తి సూర్య నారాయ‌ణ అనే పాత్ర‌లో నటించాడు. రుహ‌నీ శ‌ర్మ హీరోయిన్‌గా చేసింది. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌తో వచ్చారు. ఈ సినిమా థియేటర్స్‌‌లో బాగానే సందడి చేస్తుంది.

తాజాగా ఈ సినిమా గురించి అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బట్టతల విషయంలో కొంతమంది ఇబ్బంది పడటం నేను చూశాను .. అలా బాధపడవలసిన అవసరం లేదనే విషయాన్ని నేను కాస్త బలంగా చెప్పాలనుకున్నాను. ఈ సినిమా ద్వారా అదే చేశాను అన్నారు. అలాగే నటుడిగా .. రచయితగా .. దర్శకుడిగా పనిచేసిన నాకు రచన ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. నాని కోసం ఓ కథను సిద్ధం చేయాలనీ చూస్తున్నా.. అలాగే నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి సగంలో ఉంది. కరోనా కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. నాగశౌర్య .. మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పరిస్థితులు అనుకూలించగానే మళ్లీ మొదలవుతుంది అని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: హుషారైన మాటలతో.. చలాకీ తనంతో హౌస్‌లో హడావిడి చేసేస్తున్న భామ..

Kangana Ranaut : నాకు తమిళం గురించి కానీ.. ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు.. ఆసక్తికర కామెట్స్ చేసిన కంగన

Aditi Shankar: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ కూతురు.. కార్తీకి జోడిగా అదితి శంకర్..