Bigg Boss 5: ‘అరే ఏంట్రా ఇది’.. హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. యాంకర్ రవి, షణ్ముఖ్‌‌లే టార్గెట్.!

Bigg Boss 5 Telugu: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. హౌస్‌లోకి ఎంటరైన 19 మంది కంటెస్టెంట్లలో కొందరు బుల్లితెరపై పాపులర్..

Bigg Boss 5: 'అరే ఏంట్రా ఇది'.. హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. యాంకర్ రవి, షణ్ముఖ్‌‌లే టార్గెట్.!
Bigg Boss 5
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 06, 2021 | 9:43 PM

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. హౌస్‌లోకి ఎంటరైన 19 మంది కంటెస్టెంట్లలో కొందరు బుల్లితెరపై పాపులర్ స్టార్స్ కాగా.. మరికొందరు యూట్యూబర్స్. ఎవరు ఏదైనా కూడా బిగ్ బాస్ తొలి రోజు నుంచే తన ఆటను షూరూ చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ సోమవారం ఎలిమినేషన్స్ ప్రక్రియ ఉంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

హౌస్‌లో ఉన్న 19 మంది కంటెస్టెంట్లలో ఫోటోలను చెత్త కవర్‌లకు పెట్టి.. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో.. వారి ఫోటోతో ఉన్న చెత్త కవర్‌ను డస్ట్ బిన్‌లో వేయాలని చెబుతూ బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు. అగ్గి రాజేస్తే.. హౌస్‌మేట్స్ మధ్య గొడవ మొదలు కావడం ఖాయం. ఇక అదే జరిగింది.

ప్రోమో ప్రకారం.. మొదట నామినేట్ చేసేందుకు లోబో రాగా.. అతడు నవ్విస్తూనే నామినేట్ చేసినట్లు ఉంది. అయితే యాంకర్ రవి ఫోటో ఉన్న చెత్త కవర్‌ను తీసుకుని ”నీ యాటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో” అంటూ లోబో ఇచ్చిపడేశాడు. అనీ మాస్టర్.. సిరి హనుమంత్‌ని నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక సరయు ఏమో కాజల్‌ను నామినేట్ చేసింది.

నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్ చేసిన యాంకర్ రవి.. ”మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రిక్ట్‌గా అనిపిస్తున్నారంటూ” తన నామినేషన్‌కు గల కారణాన్ని వివరించాడు. ఇక ఈ నామినేషన్ యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య పెద్ద రచ్చకు దారి తీసింది. అటు నటరాజ్ మాస్టర్ కూడా యాంకర్ రవిని నామినేట్ చేస్తూ ”నేను అలాగే ఉంటాను.. నాకు నటించడం రాదు” అంటూ కౌంటర్ ఇచ్చాడు.

అలాగే షణ్ముఖ్‌, సన్నీ మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. ‘మనం ఏం చేసినా సైన్యం ఉందని అనుకుంటాం కానీ.. ఇక్కడకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికీ ఓ సైన్యం ఉంటుంది’ అని అంటూ సన్నీ.. షణ్ముఖ్‌‌ను నామినేట్ చేయగా.. ‘ఏమో నాకైతే ఆ ఫీలింగ్ లేదు’ అని షణ్ముఖ్‌ అంటాడు. ఆ తర్వాత సరయు ఫైర్.. జెస్సీ-విశ్వల గొడవ.. చివర్లో జెస్సీ ఏడుపు.. నటరాజ్ మాస్టర్ గీతోపదేశం… ఇలా ప్రోమో ఎండ్ అవుతుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

Also Read: 75 నిమిషాల బ్యాటింగ్.. 500 స్ట్రైక్‌రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. మ్యాచ్ విన్నర్‌గా మాజీ ముంబై ప్లేయర్.!

ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!