Gummanur Jayaram: ఏపీ మంత్రి జయరాం ఫోన్ బెదిరింపులు.. వైరల్ అవుతోన్న వీడియో
సీమలో ఓ మంత్రి ఎస్‌ఐకి ఫోన్ చేశారు. ఎందుకంటే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌లను పట్టుకుంటే వదిలేయమని చెప్పడానికి కాల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో
Gummanur Jayaram: సీమలో ఓ మంత్రి ఎస్‌ఐకి ఫోన్ చేశారు. ఎందుకంటే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌లను పట్టుకుంటే వదిలేయమని చెప్పడానికి కాల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఏపీలో రాజకీయ దుమారానికి దారితీస్తోంది. మంత్రి.. ఎస్సైని బెదిరించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న కారణంతో ఆస్పరి ఎస్ఐ 40 మందిని అరెస్ట్ చేసి.. ట్రాక్టర్‌లను స్టేషన్‌లో పెట్టారు. విషయం మంత్రి దృష్టికి రావడంతో ఆయన నేరుగా ఎస్‌ఐ ముని ప్రతాప్‌కి ఫోన్ చేశారు.
ఇసుక ట్రాక్టర్లను వదిలేయండి.. లేదంటే చెప్పండి నేనే ధర్నా చేస్తానంటూ ఆడియోలో ఉంది. నాకు జనం ముఖ్యం… ఈసారి కూడా ఇక్కడ నేనే పోటీ చేసేది.. నేను గెలిస్తేనే ఇడ యవ్వారం అయ్యేది, నేను ధర్నాకు దిగాలా.. ట్రాక్టర్లను వదిలేస్తారా చూడండి అంటూ ఫోన్‌లో హెచ్చరించారు. ఇసుక రవాణా చేస్తున్నట్లు ఎవరైనా చూస్తే పట్టుకోండి.. లేదంటే వదిలేయండని మంత్రి గుమ్మనూరు జయరాం హుకుం జారీ చేయడం వివాదాస్పదమవుతోంది.
తన పేరుతో వైరలైన వీడియోపై మంత్రి జయరాం స్పందించారు. తాను ఎవరినీ బెదిరించలేదని టీవీ9తో చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీలకు.. ఇసుక తరలిస్తుంటే ఎస్సై అడ్డుకున్నారని బాధితులు నాతో చెప్పారని తెలిపారు. బాధితుల పరిస్థితి చూడలేకే ఆవేదనతో ఎస్సైతో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు మంత్రి జయరాం. SI ని బెదరించలేదని చెప్పుకొచ్చారాయన.