Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Lovers: ఇక్కడి రైతులు తమ ఆవులను హెలికాప్టర్ ద్వారా తరలించారు.. కారణం తెలిస్తే..

జంతు ప్రేమికులు తరచుగా ఇంటర్నెట్‌లో ఫోటోలు, వీడియోలు చూస్తూ తమ సమయాన్ని వాటి రక్షణ కోసం గడుపుతుంటారు. జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను...

Cow Lovers: ఇక్కడి రైతులు తమ ఆవులను హెలికాప్టర్ ద్వారా తరలించారు.. కారణం తెలిస్తే..
Cows Airlift
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 07, 2021 | 7:51 AM

జంతు ప్రేమికులు తరచుగా ఇంటర్నెట్‌లో ఫోటోలు, వీడియోలు చూస్తూ తమ సమయాన్ని వాటి రక్షణ కోసం గడుపుతుంటారు. జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా చూస్తారు. అలాంటి వ్యక్తులు తమ పెంపుడు జంతువులను ఎంతగా ప్రేమిస్తారనే దానికి గొప్ప ఉదాహరణ స్విట్జర్లాండ్‌లో కనిపించింది. ఇక్కడ కొన్ని ఆవులను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా పర్వతం నుండి కిందకు దించారు. ఆవులను ఈ ఎయిర్‌లిఫ్టింగ్‌ను రైతులు స్వయంగా చేశారు. దీని వెనుక కారణం తెలిస్తే మీరు కూడా భావోద్వేగానికి లోనవుతారు.

స్విట్జర్లాండ్‌లోని ఆవులను పర్వతాలపై నుంచి కిందికి దించేందుకు హెలికాప్టర్‌ను ఉపయోగించారు. ఇలా హెలికాప్టర్‌ ద్వారా  దిగువన ఉన్న గడ్డి భూములకు తీసుకువచ్చారు. అక్కడి రైతులు ఆవును కన్న తల్లిగా చూస్తారు. వాటికి చిన్న కష్టం వచ్చినా వారు తట్టు కోలేరు. అక్కడి రైతులు ఆవుల పట్ల తన హృదయం ఎంత మృదువుగా ఉంటుందో చూపిస్తుంది.

వాస్తవానికి ఈ ఆవులు వేసవిలో మేత కోసం పర్వత ప్రాంతాల్లోకి  వెళ్తాయి. ఆ తరువాత వాటిని చలికాలంలో మైదాన ప్రాంతాలకు తీసుకువస్తారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని ఆవులు పర్వతాల మీద అనారోగ్యానికి గురై.. గాయపడ్డాయి. ఈ ఆవులను దిగువకు తీసుకురావడానికి వీలుగా రోడ్డు మార్గం లేదు. దీంతో అక్కడి రైతులు వాటిని హెలికాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆవులు నడవడానికి ఇబ్బంది పడకుండా వారికి నొప్పి కలగకుండా ఉండటానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

ఎయిర్ లిఫ్టింగ్ సమయంలో ఆవులు..

ఎయిర్‌లిఫ్టింగ్ సమయంలో ఆవులు భయపడలేదు. దీని కోసం వాటిని సరిగ్గా తాడులతో కట్టి.. వాటికి గాయాలు కాకుండా మంచి మొత్తటి క్లాత్‌ను వాటికి చుట్టారు. అనారోగ్యంతో ఉన్న ఆవులను ఎయిర్‌లిఫ్ట్‌ చేయగా ఆ సమయంలో ఆరోగ్యకరమైన ఆవులు తాము పర్వతం నుండి కిందకు చేరుకున్నాయి. మందలో సుమారు 1 వేల ఆవులు ఉన్నాయి. వాటిలో సుమారు 10 ఆవులను ఎయిర్ లిఫ్ట్ చేసి కిందకు దించారు. రైతు జోనాస్ ఆర్నాల్డ్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ మా వద్ద ఉన్న కొన్ని ఆవులు గాయపడ్డాయి. దీంతో వాటిని ఇక్కడి తీసుకురావడం మాకు చాలా ఇబ్బందిగా మారింది. ఆవులు బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. అందుకే మేము హెలికాప్టర్ ద్వారా దించాలని నిర్ణయించుకున్నాము.

స్విట్జర్లాండ్‌లో కౌ హగ్గింగ్..

స్విట్జర్లాండ్‌తోపాటు అమెరియాలో ‘‘కౌ హగ్గింగ్’’ ట్రెండింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.  చాలా దేశాల్లో కౌ హగ్గింగ్ వెల్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కౌ హగ్గింగ్ వల్ల మనుషులే లాభం పడటం మాట పక్కన పెడితే దాని వల్ల ఆవులు చాలా ఆనందాన్ని పొందుతున్నాయని అధ్యయనంలో తేలింది. ఇటీవలే యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు పబ్లిష్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి: Beauty Tips: గుడ్డు పెంకును పారేస్తున్నారా?.. దాని ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..!

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..