Challenge : మద్యం మత్తులో స్నేహితుల విచిత్ర పందెం.. ఏకంగా 400 కిలోమీటర్లు పరుగులు పెట్టారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Challenge : మద్యం మత్తులో ఉన్న వారు ఏం మాట్లాడుతారో.. ఏం చేస్తారో సరిగ్గా అవగాహన ఉండదు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. మద్యం ఫుల్లుగా తాగిన తరువాత వారి మాటలు కోటలు దాటుతాయి.

Challenge : మద్యం మత్తులో స్నేహితుల విచిత్ర పందెం.. ఏకంగా 400 కిలోమీటర్లు పరుగులు పెట్టారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Runners

Challenge : మద్యం మత్తులో ఉన్న వారు ఏం మాట్లాడుతారో.. ఏం చేస్తారో సరిగ్గా అవగాహన ఉండదు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. మద్యం ఫుల్లుగా తాగిన తరువాత వారి మాటలు కోటలు దాటుతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో విచిత్ర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను తోపుని అని ఒకరంటే.. నేను హైపర్ అని మరొకరు ఇలా రచ్చ రచ్చ జరుగుతుంది. అదే సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా జరుగుతాయి. అయితే, ఈ సవాళ్లను కొందరు జోక్‌గా తీసుకుంటే.. మరికొందరు మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. సవాళ్లను నెరవేర్చడానికి జీవితాలను పణంగా పెట్టేవారు కూడా ఉంటారు. ఇలాంటి ఘటనే తాజాగా తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న కొందరు స్నేహితులు.. వింత పనులు చేశారు. మద్యం సేవించిన తరువాత పరస్పరం వేసుకున్న సవాళ్ల నేపథ్యంలో వారు పర్వత ప్రాంతాల మీదుగా 400 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలా.. ప్రంపచంలోనే ఇంత పెద్ద రేసును కాలినడకన పూర్తి చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జోడీ బ్రాగ్గర్, జోడీ గౌల్డ్, గేబ్ గిగ్లియోన్ అనే ముగ్గురు స్నేహితులు. ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. ఈ మద్యం మత్తులో ఉన్న వీరు విచిత్ర పందెం వేసుకున్నారు. వారి వద్ద ఓ గ్లోబ్ ఉండగా.. దానిపై వేళ్లు పెట్టిన చోటకు పరుగెత్తాలని నిర్ణయించుకున్నారు. అలా ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి గ్లోబ్‌పై వేలు పెట్టాడు. అది తజికిస్తాన్‌ను చూపించింది. పందేన్ని సీరియస్‌గా తీసుకున్న వారు తామున్న ప్రాంతం నుంచి 258 మైళ్లు(400 కిలోమీటర్లు) పరుగులు తీశారు. కొండ పర్వతాల వెంబడి నడుస్తూ.. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలో వారే అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దుల్లోని చైనా, తజికిస్తాన్ బర్తాంగ్ లోయ వరకు వీరు నడిచారు. ఇది ప్రపంచంలోని అత్యంత మారుమూల, జనావాసాలు లేని ప్రాంతం.

పందెం నెరవేర్చడమే లక్ష్యం..
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిలో ఒకడైన జోడీ గౌల్డ్ స్పందించాడు. ‘‘నేను మంచి రన్నర్‌ని. అందులోనూ తాగి ఉండటంతో మాంచి కిక్‌లో ఉన్నాను. మద్యం మత్తులో పందెం వేసినప్పుడు తజికిస్తాన్ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ పందెం నెరవేర్చడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ రేసును ప్రారంభించేటప్పుడు మాకు మ్యాప్, మార్గం గురించి పెద్దగా సమాచారం లేదు.’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘ఇది చాలా దూరం. కానీ మేం చేయగలమని అనుకున్నాం. చాలా ఉత్సాహంగా భావించాం. అయితే, ఈ ప్రయాణంలో మేం అనారోగ్యానికి గురయ్యాడు. గాయాలు, ప్రకృతి అడ్డంకులు, మండుతున్న వేడి, వీసా అధికారులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాము.’’ అని జోడీ తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు.

7 రోజుల్లో ప్రయాణం పూర్తి..
జోడీ బ్రాగ్గర్, జోడీ గౌల్డ్, గేబ్ గిగ్లియోన్ డాలీ ఒక మారథాన్ మొత్తానికి తమ టార్గెట్‌ను పూర్తి చేశారు. 7 రోజుల్లో తమ ప్రయాణాన్ని పూర్తి చేసి కుర్కుల్ సరస్సు చేరుకున్నారు. ‘‘ఈ రేసును అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశాం. ఇంతకు ముందు ఎప్పుడూ వినని, కనని ప్రదేశానికి ప్రయాణించడ చాలా ప్రత్యేకంగా అనిపించింది.’’ అని జోడీ తెలిపాడు. కాగా, ఈ పందెం జోడీ, గేబ్ మధ్య జరిగింది. కానీ, వీరికి మరొక భాగస్వామి అవసరం భావించారు. అలా జోడీ గౌల్డ్ తన స్నేహితుడికి కాల్ చేశాడు. ముగ్గురూ కలిసి మొత్తానికి తమ ప్రయణాన్ని పూర్తి చేశారు. కాగా, ఈ ముగ్గురు స్నేహితుల ప్రయాణాన్ని సోర్సరీ ఫిల్మ్స్‌కు చెందిన అలెక్సిస్ టైమన్, బెన్ క్రోక్ డాక్యుమెంట్ చేశారు. అతని చిత్రం, రన్నింగ్ ది రూఫ్, బాన్ఫ్ మౌంటైన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

Also read:

Tiger vs Man: ఒకే ఒక్కడు.. 20 నిమిషాలపాటు పులితో పోరాడాడు.. ఆ తరువాత ఏజరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

Invest Scheme: రూ .12,500 చెల్లించండి, రూ. 4.62 కోట్లు పొందండి.. ఈ మెసేజ్ వచ్చిందా? అయితే ఇది చూడండి..

Bigg Boss 5 Telugu: సీరియస్.. ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్ జోన్‏లోకి ఆరుగురు సభ్యులు ..

Click on your DTH Provider to Add TV9 Telugu