ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. అంగారకుడిపై ఇక నీటి కష్టాలకు చెక్..!

Ilu Robot:ఎడారిలో మంచినీరు ఎలా తయారుచేస్తారని ఆశ్చర్యపోతున్నారా..? ఇదిగో 28 ఏళ్ల ఈజిప్టు ఇంజనీర్ అలాంటి ఓ అద్భుతాన్ని చేసి చూపించాడు.

ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. అంగారకుడిపై ఇక నీటి కష్టాలకు చెక్..!
Ilu Robot
Follow us

|

Updated on: Sep 07, 2021 | 9:15 AM

Ilu Robot: ఎడారిలో మంచినీరు ఎలా తయారుచేస్తారని ఆశ్చర్యపోతున్నారా..? ఇదిగో 28 ఏళ్ల ఈజిప్టు ఇంజనీర్ అలాంటి ఓ అద్భుతాన్ని చేసి చూపించాడు. ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు చేయవచ్చంటూ మరోసారి నిరూపించాడు. అతని పేరు మహమూద్ ఎల్ కోమి. అతను తయారు చేసిన రోబోట్ పేరు ఇలూ. ఇది ఎడారిలోని గాలి నుంచి నీటిని తయారు చేస్తుందని ఆయన తెలిపాడు. కృత్రిమ మేధస్సు సహాయంతో గాలిలో ఉన్న తేమను నీటిగా మారుస్తుంది. దీంతోనే ఇక అంగారక గ్రహంపైకి వెళ్లే వ్యోమగాములకు నీటి కొరత ఉండదంటూ చెప్పుకొచ్చాడు. ఈ రోబో తేమను గ్రహించి అంగారకుడిపై కూడా నీటిని తయారు చేయగలదని ఇంజనీర్ కోమి పేర్కొన్నారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు.. ఇంజనీర్ ఎల్ కోమీ ప్రకారం, ఇలూ కృత్రిమ మేధస్సు సహాయంతో పనిచేస్తుంది. రిమోట్‌తో దీనిని నియంత్రించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తయారు చేయగల సాంకేతికతతో తయారు చేశామంటూ తెలిపాడు. నేను ఎటువంటి సమస్య లేకుండా రోజూ 5000 లీటర్ల నీటిని అందించగల అనేక రోబోలను తయారు చేయగలనని ఆయన పేర్కొన్నాడు. ఇతర సాంకేతికతలతో పోలిస్తే ఈ రోబోట్‌తో నీటిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.

మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌లకు మెరుగైన ప్రత్యామ్నాయం.. ప్రస్తుతం గాలి నుంచి నీటిని తయారు చేయడానికి మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ ఎంతో ఖరీదైనది. అలాగే దీనికి చాలా శక్తి అవసరం. ఇలూ మాత్రం చాలా చౌకగా, సమర్థవంతమైన నీటిని తయారు చేస్తోంది. మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌‌లకు ప్రత్యామ్నాయంగా ఈ రోబోట్ మారనుంది.

రోబో తయారీకి కేవలం 9 నెలలే.. ఇలూ రోబో తయారీకి కేవలం 9 నెలలు మాత్రమే పట్టింది. కరువుతో అల్లాడే ప్రాంతాలు, నీరు అస్సలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఇలూ పెద్ద ఎత్తున నీటిని తయారు చేస్తోంది. దీని ఉపయోగంతో ఎటువంటి ప్రాంతంలోనైనా ఇక నుంచి నీటి కరవు ఉండదని ఇంజనీర్ కోమి చెప్పారు.

కోమి ప్రకారం, ఈ రోబోను సిద్ధం చేయడానికి దాదాపు రూ. 18 వేలు ఖర్చు చేశారు. ఇలూ నుంచి ఒక లీటరు నీటిని సిద్ధం చేయడానికి కేవలం 7 పైసలు మాత్రమే ఖర్చు కానుంది. అయితే, మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌‌ల సహాయంతో మాత్రం 75 పైసలు ఖర్చు అవ్వనుంది.

Also Read: Jio Phone Next: మీరు చెప్పండి చాలు..మీకు కావలసింది చూపిస్తుంది.. జియో ఫోన్ నెక్స్ట్ అద్భుత ఫీచర్ ఇది మీకు తెలుసా?

Dengue Mosquitoes: డెంగ్యూ దోమలను వేడితో చంపేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.. ఎలానో తెలుసుకోండి.

European Glaciers: మంచు పాచెస్‌గా మరిపోనున్న యూరోపియన్ హిమానీనాదాలు..కారణమిదే!