ఒక రాతి లోపలి నుండి పదార్థాన్ని సేకరించిన రోవర్, నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) కు ఆ విషయంపై ధృవీకరణను ఇచ్చింది. ఈ నమూనా ఇప్పుడు గాలి చొరబడని టైటానియం శాంపిల్ ట్యూబ్‌లో నిలువ చేసి ఉంది. ఇది భవిష్యత్తులో తిరిగి పొందడానికి అందుబాటులోకి వస్తుంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) రెండూ ఈ నమూనాలను భూమికి తిరిగి తీసుకురావడానికి అనేక మిషన్లను ప్లాన్ చేస్తున్నాయి."ఈ శాంపిల్స్ శాస్త్రీయంగా గుర్తించిన,ఎంపిక చేసిన పదార్థాల మొదటి సెట్, మరొక గ్రహం నుండి మనగ్రహానికి తిరిగి వచ్చాయి" అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.