Tiger vs Man: ఒకే ఒక్కడు.. 20 నిమిషాలపాటు పులితో పోరాడాడు.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..
Tiger vs Man: అడవిలోని అత్యంత ప్రమాదకరమైన జంతువుల గురించి అడిగితే.. టక్కున సింహం, పులి మరొకన్ని జంతువుల పేరు చెబుతారు. అయితే, వీటిలో పులి చాలా డేంజర్ అని చెప్పాలి.

Tiger vs Man: అడవిలోని అత్యంత ప్రమాదకరమైన జంతువుల గురించి అడిగితే.. టక్కున సింహం, పులి మరొకన్ని జంతువుల పేరు చెబుతారు. అయితే, వీటిలో పులి చాలా డేంజర్ అని చెప్పాలి. ఇతర క్రూర జంతువులకు భిన్నంగా ఉంటుంది దీని వేట. పులి తన పంజాతో ప్రత్యర్థిని దారుణంగా దెబ్బ తీస్తుంది. అదును చూసి దాడి చేస్తుంది. పులి కంట పడితే తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం. కానీ ఒక్కడ ఓ వ్యక్తి పులి కంట పడటమే కాదు.. దానితో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 నిమిషాల పాటు పులితో వీరోచితంగా పోరాడాడు. ఏమాత్రం భయపడకుండా.. పులికే చుక్కలు చూపించాడు. చివరకు మరికొందరు ప్రజలు రావడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్‌లోని సుందర్‌బన్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని గోసాబాలోని సోనాగా గ్రామంలో కొందరు ప్రజలు జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే సుదర్శన్ సర్దార్ (33) మత్స్యకారుడు తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. అటవీ ప్రాంతం గుండా ప్రవశించే నదిలో సుదర్శన్ సర్దార్ చేపల వేట సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ పెద్ద పులి వారిని గమనించింది. అదును చూసి వారిపై దూకింది. పడవలోకి వచ్చిన పులి.. సుదర్శన్ సర్దార్‌పై అటాక్ చేసింది. అయితే, పులిని సర్దార్ ఏమాత్రం భయపడలేదు. దాంతో పోరాటం సాగించాడు. మిగతా స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అతను మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. దాదాపు 20 నిమిషాల పాటు పులితో ఫైట్ చేశాడు. ఇంతలో అతని స్నేహితులు మిగతా గ్రామస్తులను తీసుకువచ్చారు. వారు పులిని భయపెట్టి అదిలించారు. దాంతో పులి పారిపోయింది. పులి వెళ్లిపోయిన వెంటనే గ్రామస్తులు సర్దార్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలికడగా ఉందని వైద్యులు తెలిపారు. పులి దాడిలో అతనికి స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు.
Also read: