Invest Scheme: రూ .12,500 చెల్లించండి, రూ. 4.62 కోట్లు పొందండి.. ఈ మెసేజ్ వచ్చిందా? అయితే ఇది చూడండి..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 07, 2021 | 6:58 AM

Invest Scheme: ‘‘రూ.12,500 పెట్టుబడి పెట్టండి. రూ. 4.62 కోట్ల రాబడిని పొందండి. ఖచ్చితమైన హామీ ఇది. ఆన్‌లైన్‌లో రూ .12,500 బదిలీ చేసిన వెంటనే.. బ్యాంక్ మేనేజర్ మీ ఖాతాలో

Invest Scheme: రూ .12,500 చెల్లించండి, రూ. 4.62 కోట్లు పొందండి.. ఈ మెసేజ్ వచ్చిందా? అయితే ఇది చూడండి..
Cheating

Follow us on

Invest Scheme: ‘‘రూ.12,500 పెట్టుబడి పెట్టండి. రూ. 4.62 కోట్ల రాబడిని పొందండి. ఖచ్చితమైన హామీ ఇది. ఆన్‌లైన్‌లో రూ .12,500 బదిలీ చేసిన వెంటనే.. బ్యాంక్ మేనేజర్ మీ ఖాతాలో రూ. 4.62 కోట్లు జమ చేస్తారు. అది కూడా అరగంటలోపు.’’ ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నమ్మలేకపోతున్నారా? పోనీ ఇలాంటి సందేశాలు మీకేమైనా వచ్చాయా? వస్తే తస్మాత్ జాగ్రత్తగా. ఇలాంటి మెసేజ్‌లను చూసి వెంటనే టెంప్ట్ అవ్వకండి. ఒక్క క్షణం ఆలోచించి.. అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి. లేదంటే.. 4.62 కోట్లు దేవుడెరుగు.. మీ అకౌంట్లో ఉన్న సొమ్మంతా ఖాళీ అవడం ఖాయం.

ప్రస్తుతం కాలంలో ప్రతీ ఒక్కరూ పొదుపుపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేటు ఉద్యోగి అయినా.. వ్యవసాయం చేసే రైతు అయినా సరే.. తాము సంపాదించే దాంట్లో కొంత సొమ్మును పెట్టుబడి పెట్టడం, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే, వీరి ఆలోచనలే ఆసరాగా తీసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సురక్షితమైన పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారు. అవకాశం వస్తే చాలు.. అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో సైబర్ మోసాల కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గ్రామాలలో నిరక్షరాస్యులు, నగరాలలో బాగా చదువుకున్న వ్యక్తులు కూడా మోసానికి గురవుతున్నారు. సైబర్ దుండగులు కొన్నిసార్లు ప్రభుత్వ పథకాల పేరుతో, మరికొన్నిసార్లు ఆర్బీఐ పేరిట ప్రజలను బాధితులుగా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆర్‌బీఐ పేరిట ఒక విడుదల చేశారు సైబర్ మోసగాళ్లు. దాని ఆధారంగా అమాయక ప్రజలను తమ బుట్టలో వేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు.

ఆర్‌బిఐ పేరుతో జారీ చేసిన నకిలీ లేఖలో ఏముంది? సైబర్ దుండగులు ఆర్‌బీఐ పేరుతో నకిలీ లేఖలు పంపడం ద్వారా ప్రజల నుంచి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దుండగులు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేరు మీద లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో, “ఆర్‌బిఐ మేనేజ్‌మెంట్, అథారిటీ రూ .12,500 ఆన్‌లైన్ బదిలీ చేసిన తర్వాత, బ్యాంక్ మేనేజర్ మీ ఖాతాకు రూ. 4,62 మిలియన్లను బదిలీ చేస్తారు. ఇది కొత్త పెట్టుబడి పథకం.’’ అని పేర్కొన్నారు.

పీఐబీ హెచ్చరిక.. ఇదిలాఉంటే.. ఈ నకిలీ లేఖపై పీఐబీ ప్రజలను హెచ్చరించింది. తప్పుడు లేఖ అంటూ ప్రజలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మూవీ హేరా ఫెరీ వీడియో క్లిప్‌ను షేర్ చేసిన పీఐబీ.. సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. పీబీఐ ఫ్యాక్ట్ చెక్ వింగ్ దీనిపై ఆరా తీసి అసలు నిజాలను బట్టబయలు చేసింది. ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి, ఈ లేఖకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చింది. ఈ లేఖను సైబర్ నేరగాళ్లు విడుదల చేశారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మోసగాళ్లు, సైబర్ దుండగులు తరచుగా ప్రభుత్వ సంస్థల పేరిట సందేహాలు, లేఖలు విడుదల చేసి ప్రజలను మోసం చేస్తుంటారని, అటువంటి లేఖల పట్ల ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని సూచించింది.

Also read:

Bigg Boss 5 Telugu: సీరియస్, ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్ జోన్‏లోకి ఆరుగురు..

Signature: మొదటి సంతకం ఎవరు చేశారో తెలుసా? అసలు సంతకం చేసే సంప్రదాయం ఎక్కడ ప్రారంభమైంది? ఆసక్తికర విషయాలు మీకోసం..

Horoscope Today: ఈ రోజు ఈ రాశుల వారికి దుబారా ఖర్చు.. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్త

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu