Horoscope Today: ఈ రోజు ఈ రాశుల వారికి దుబారా ఖర్చు.. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్త

uppula Raju

uppula Raju |

Updated on: Sep 07, 2021 | 6:53 AM

Horoscope Today: ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో

Horoscope Today: ఈ రోజు ఈ రాశుల వారికి దుబారా ఖర్చు.. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్త
Horoscope Today

Follow us on

Horoscope Today: ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాదాపు రాశి ఫలాలను విశ్వసించేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. మరీ ఈ రోజు ఏఏ రాశుల వారికి అనుకూలంగా ఉందో తెలుసుకుందామా.

మేష రాశి: ఆత్మ విశ్వాసంతో ఉండండి. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దుబారా ఖర్చులను నివారించండి. కుటుంబంలో కొన్ని ముఖ్య విషయాలను మీ భార్య భర్తలు తెలివిగా పరిష్కరించుకోండి. స్నేహితులతో అనవసర బాతాఖానీ వలన సమయం వృధా.

వృషభ రాశి: దైవ ప్రార్ధన వల్ల మానసిక బలం. అనుకున్న కార్యాన్ని సాధించాలంటే ఆత్మవిశ్వాసం పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో పరుషంగా మాట్లాడకండి. దాని వల్ల వారు హర్ట్ అవుతారు. ఇద్దరి దూరాలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. కళా రంగంలోని వారికి పేరు ప్రఖ్యాతులు.

మిధున రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. గుర్తుంచుకోండి అన్ని కష్టాలకు చిరునవ్వే దివ్యౌషధం. ప్రేమికులు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. సమయం వృధా అయ్యే వ్యాపకాలను వదిలిపెట్టండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన భవిష్యత్తులో విజయాలు.

కర్కాటక రాశి: ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి చూపిస్తారు. దైవ ప్రార్ధన వల్ల మానసిక బలం ప్రశాంతత. ఈ జీవితం మీకు దేవుడిచ్చిన వరం. అది గుర్తించండి. ప్రతి విషయానికి విచారం వల్ల ఉపయోగం లేదు. ఆఫీసు పనులలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు అందుకని జాగ్రత్తగా పనులు పూర్తి చేయండి. ఆదాయం బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు అధికం అవటం వల్ల మానసిక అశాంతి.

సింహరాశి: ఉజ్వలమైన ఎదుగుదలకు మీరు మరింత కష్టపడాలి. అనుకున్న కార్యాలను సాధించాలంటే ఆశావహ దృక్పథం తప్పనిసరి. ఎంతో కాలము నుంచి ఎదురు చూస్తున్న రుణం మంజూరు అవుతుంది. మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ.

కన్య రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. బయట భోజనం వల్ల అజీర్తి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు భవిష్యత్తులో లాభిస్తాయి. ఆఫీసులో అదనపు బాధ్యతల వల్ల పనులలో అధిక శ్రమ ఈ రాశి స్త్రీల కి మీ భర్త హాస్యచతుర సంభాషణ మిమ్మల్ని ఆనందింప చేస్తుంది.

తులారాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఏమాత్రం కష్టం లేకుండా అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవ ప్రార్థనలు వల్ల మానసిక బలం. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. అట్టహాసంగా ఏర్పాటు చేసిన పార్టీ వల్ల అధిక ఖర్చు. దాని వల్ల మానసిక విచారం. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు

వృశ్చిక రాశి: ఈరోజు ఉత్సాహకరమైన రోజు. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించి అనుకున్న కార్యాలను సాధిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఊహించుకుని బాధపడటం మానేయటం వల్ల మానసికంగా బలవంతులు అవుతారు. ఆఫీసులో పనులను చకచకా పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులపై ధైర్యంగా నిర్ణయం తీసుకోండి.

ధనస్సు రాశి: మీ ఆత్మవిశ్వాసం అంబరాన్ని అంటుతుంది. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. అనుకోని అతిథి రాక వల్ల మీ సమయం వృధా. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి మీ సామరస్య ధోరణి వల్ల ఆఫీసులో ఆహ్లాదకర వాతావరణం.

మకర రాశి: మీరు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. కొన్ని సవాళ్లను ఎదుర్కోవడం కష్టతరమవుతుంది. నిరాశను వదలకపోతే అది మీ మనస్సును శరీరాన్ని తొలిచి వేస్తుంది. సహనంతో వ్యవహరించండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దైవప్రార్థన వల్ల మానసిక బలం. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కుటుంబ సభ్యుల మీద మీ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకండి.

కుంభరాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటిని రెండు చేతుల అందిపుచ్చుకోండి. మీ శ్రీఘ్ర నిర్ణయం విజయాలను తెస్తుంది ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. మీ తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.

మీన రాశి: కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. డబ్బు సంపాదనకు అన్ని మార్గాల వైపు చూస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో పరుషంగా మాట్లాడకండి. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు వల్ల అలసట తిప్పట.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu