Zodiac Signs: ఈ రాశులకు చెందిన వారికి సిగ్గెక్కువ..కొత్తవారితో కలవాలంటే ఇబ్బంది పడతారు.. ఏ రాశుల వారు ఇలా ఉంటారంటే..

KVD Varma

KVD Varma |

Updated on: Sep 07, 2021 | 7:53 PM

మీరు ఒక పార్టీ లేదా గెట్ టుగెదర్‌లో ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి ఒక వైపు చివరగా కూచుని అందరినీ దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అహంకారి లేదా ఒంటరివాడు కాదు.

Zodiac Signs: ఈ రాశులకు చెందిన వారికి సిగ్గెక్కువ..కొత్తవారితో కలవాలంటే ఇబ్బంది పడతారు.. ఏ రాశుల వారు ఇలా ఉంటారంటే..
Zodiac Signs

Follow us on

Zodiac Signs: మీరు ఒక పార్టీ లేదా గెట్ టుగెదర్‌లో ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి ఒక వైపు చివరగా కూచుని అందరినీ దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అహంకారి లేదా ఒంటరివాడు కాదు. కానీ, పిరికివాడు. సిగ్గుపడే వ్యక్తి. ఇటువంటి వారు పదిమందిలో కలవడం విషయంలో చాలా సిగ్గుపడతారు. మొహమాటంతో ఒక పక్కగా ఉండిపోతారు. అందరిలో మాట్లాడటం అంటే, సంకోచం ఉంటుంది. అదేవిధంగా వీరికి అభద్రతా భావం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే, ఇటువంటి వారు కొత్తగా అలా కలవటానికి ఇబ్బంది పడతారు కానీ, ఒక్కసారి అందరితో పరిచయం అయిన తరువాత, ఇక ఎవరూ వారిని ఆపలేరు. పరిచయస్తులతో చక్కగా కలిసిపోతారు. జ్యోతిషశాస్త్రం కొంతమందిలో కనిపించే ఈ రకమైన లక్షణాలకు కారణం వారి రాశి చక్రం అని చెబుతుంది. కొంతమంది వారి రాశి చక్రాన్ని అనుసరించి అలా పదిమందిలోనూ త్వరగా కలవలేకుండా ఉండిపోతారని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు ఇలాంటి సిగ్గరి లక్షణాలను కనబరిచే వారి రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటకం

కర్కాటక రాశి వారు పిరికి వారుగా ఉంటారు. వారు సాధారణంగా ఇతర వ్యక్తులను బాగా విశ్వసిస్తారు. అంతేకాకుండా గొప్ప వినేవారుగా కూడా ఉంటారు. వారు నిశ్శబ్దంగా ఉండటం ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయగల ఆలోచనాత్మక, సున్నితమైన వ్యక్తులుగా ఉంటారు.

కన్యా రాశి

ఎవరి ముందునైనా తమ అభిప్రాయాన్ని ఉంచే ముందు ఈ రాశివారు బాగా ఆలోచిస్తారు. కన్యా రాశి వారు మొదట తన ప్రకటనల పరిణామాలను ఊహించుకుంటారు. అందువల్ల సిగ్గుగా నిశ్శబ్దంగా కనిపిస్తారు. వారు తెలివి తక్కువవారుగా ఉంటారు. తరచుగా ఈ అలవాటు కారణంగా సరైన సమయంలో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

వృశ్చికరాశి

మర్మమైన వారు. అంటే వారిని అంచనా వేయడం చాలా కష్టం. ఇది వృశ్చిక రాశి వారికి మరొక పేరు. వారు జాగ్రత్తగా.. రహస్యంగా ఉంటారు. అందువల్ల, కొత్త వ్యక్తులతో అన్నీ నచ్చితే కానీ కలవలేరు. వారు తమంతట తాముగా జీవిస్తారు. కొన్నిసార్లు వారి ఒంటరితనం కారణంగా మోసపూరితంగా ఇతరులకు కనిపించవచ్చు.

మకరం

మకరరాశి వారు స్వభావంతో సిగ్గుపడతారు. వారు అందరితో కలవడానికి సమయం తీసుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో మరింత నిష్కర్షగా, దృఢంగా ఉండటానికి తరచుగా తమను తాము నెట్టుకుంటారు. వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కానీ, వారి పిరికితనం కారణంగా వారు అణచివేతకు గురవుతారు.

మీనం

మీనరాశి ప్రజలు తమకు తెలిసిన వ్యక్తుల చుట్టూ చాలా సౌకర్యంగా ఉంటారు. వారు ఫన్నీ, సాహసోపేతమైన వారిగా ఉంటారు. కానీ వారిని అపరిచితుల సమూహంలో ఉంచితే వారు మాటలు రానివారిలా మారిపోతారు. ఉలుకూ పలుకూ ఉండకుండా ఉండిపోతారు.

గమనిక- ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసం, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu