AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సీరియస్.. ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్ జోన్‏లోకి ఆరుగురు సభ్యులు ..

మొదటి రోజే తన గురకతో ఇంటి సభ్యులకు నిద్రలేకుండా చేశాడు లోబో. అతని గురకను ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు కంటెస్టెంట్స్.

Bigg Boss 5 Telugu: సీరియస్.. ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్ జోన్‏లోకి ఆరుగురు సభ్యులు ..
Bigg Boss 5
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 12, 2021 | 5:02 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులోకి మొత్తం 19 కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం సాఫీగా సాగిపోయిన ఈ షో సోమవారం నుంచి అసలైన ఆట మొదలైంది. సోమవారం రోజు నామినేషన్స్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మొదటి వారంలోనే నామినేట్ అయిన సభ్యులు ఎవరో చూద్దాం..

మొదటి రోజే తన గురకతో ఇంటి సభ్యులకు నిద్రలేకుండా చేశాడు లోబో. అతని గురకను ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు కంటెస్టెంట్స్. అయిన లోబో గురక మాత్రం తగ్గలేదు. దీంతో చేసేదేమి లేక.. శ్వేతా, హమిద, జెస్సీలు కూర్చుని ముచ్చట్లు పెట్టారు. ఇక సిరి, జెస్సీలు తమకు బోర్ కొడుతుందంటూ మిగతా ఇంటి సభ్యుల వస్తువులను దొంగతనం చేశారు. ఇక తర్వాత ఉదయాన్నే ప్రణామం ప్రణామం అనే పాటకు స్టెప్పులేశారు. నటరాజ్ మాస్టార్‏ తన డ్యాన్స్‏తో ఆకట్టుకోగా.. సిరి, శ్వేత, లోబో స్విమ్మింగ్ పూల్‏లోకి దూకి రచ్చ చేశారు.

ఇక ఆ తర్వాత తమ వస్తువులు పోయాయంటూ ఇంటి సభ్యులు గోల చేయగా… దాటిపెట్టింది జెస్సీ, సిరి అని రవి కనిపెట్టేశాడు. దీంతో తామే దాచినట్లుగా ఒప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రియాంక తాను ట్రాన్స్‏జెండర్‏గా ఎలా మారిందో చెప్పుకుంటు కూర్చింది. మరో వైపు లహరి కాజల్‏ల మధ్య కూడా ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక అనంతరం నామినేషన్ ప్రక్రియ హీట్ హీట్‏గా సాగింది. తాము నామినేట్ చేయాలనుకున్న ప్రక్రియను చేయాలనుకున్నవారి ఫోటోలు ఉన్న చెత్త కవర్లను చెత్త కుండీలో వేయాలి. ఇక ముందుగా సింగర్ శ్రీరామచంద్ర.. మానస్, జెస్సీలను నామినేట్ చేశాడు. వీళ్లిద్దర్నీ నామినేట్ చేస్తూ వాళ్లతో పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఇక ఆ తర్వాత సరయు.. కాజల్, రవిలను నామినేట్ చేసింది. కాజల్‏కు గేమ్ స్ట్రాటజీ తెలుసని.. రవి తనకు గట్టి కాంపిటేటర్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్వేత… హమిద, నటరాజ్‌లను నామినేట్ చేసింది. ఆ తర్వాత విశ్వ.. జెస్సీ, మానస్‏లను నామినేట్ చేశాడు. అయితే యాటిట్యూడ్ చూపించకు అంటూ జెస్సీకి వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఉదయం జరిగిన డిస్కషన్‌లో అతని ప్రవర్తన తనకి నచ్చలేదని అందుకే నామినేట్ చేశానని చెప్పాడు. అయితే జరిగిన ఘటనను తప్పుగా అర్థం చేసుకున్నాడని జెస్సీ ఎమోషనల్ అయ్యాడు.

యానీ మాస్టర్.. సిరి, జెస్సీలను నామినేట్ చేసారు. ఇక ఆ తర్వాత జెస్సీ, విశ్వ, హామీదాలను నామినేట్ చేస్తూ.. ఆనీ మాస్టర్ తనని నామినేట్ చేసినా కోపం లేదని.. కారణం లేకుండా కోప్పడి గొడవకు కారణం అయిన హమీదాని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఇక యాంకర్ రవి.. నటరాజ్, మానస్‏లను నామినేట్ చేస్తూ.. నటరాజ్ మాస్టర్‏కు తనకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని.. కానీ ఇక్కడ కొత్తగా.. భయంగా కనిపిస్తున్నారని చెప్పాడు. అలాగే మానస్ ఎవరితోనూ కలవడం లేదని నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు.

ఇక కార్తీకదీపం ఫేమ్.. ఉమాదేవి.. కాజల్, జెస్సీని నామినేట్ చేసింది. హమీదా.. లహరి, జెస్సీలను నామినేట్ చేసింది. షణ్ముఖ్.. సన్నీ, లోబోలను నామినేట్ చేశాడు. సన్నీ, షణ్ముఖ్, సరయులను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంక.. షణ్ముఖ్, హమిదాలను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. రవి, జెస్సీలను నామినేట్ చేస్తూ.. తనకు నటించడం రాదని.. తనలాగే ఉంటానని రవికి క్లారిటీ ఇచ్చాడు. ఇక జెస్సీ అమాయకంగా కనిపిస్తున్నాడని.. ఇలా ఉంటే తొక్కేస్తారని అందుకే నామినేట్ చేశానని చెప్పాడు. దీంతో జెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ప్రియ.. సిరి, కాజల్‏లను నామినేట్ చేసింది. లోబో.. ప్రియా, యాంకర్ రవిలను నామినేట్ చేశాడు. అయితే ప్రియా, యాంకర్ రవిలు యాటిట్యూడ్ చూపించారని చెప్పాడు. మానస్, విశ్వ.. సరయులను నామినేట్ చేశాడు. సిరి.. హమీదా, ప్రియలను నామినేట్ చేశాడు. కాజల్ సరయు, ఉమలను నామినేట్ చేసింది. ఇక లహరి.. హమిదా, కాజల్‏ను నామినేట్ చేసింది. ఇక మొదటి వారం నామినేషన్ ప్రకియలో యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జెస్సీ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చేవారం ఎలిమినేట్ కాబోతున్నారు.

Also Read: Surprising Video: చిన్న పిల్లలా ఏడుస్తున్న పక్షి.. నెట్టింట్లో సంచలనంగా మారిన షాకింగ్ వీడియో..

Beauty Tips: గుడ్డు పెంకును పారేస్తున్నారా?.. దాని ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..!