Bigg Boss 5 Telugu: మూడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నా.. మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన ప్రియాంక..

Rajitha Chanti

Rajitha Chanti | Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:02 PM

బుల్లితెరపై అసలైన వినోదం ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే. ఫేమస్ రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 గ్రాండ్‏గా ప్రారంభమైంది.

Bigg Boss 5 Telugu: మూడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నా.. మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన ప్రియాంక..
Priyanka

బుల్లితెరపై అసలైన వినోదం ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే. ఫేమస్ రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 గ్రాండ్‏గా ప్రారంభమైంది. మొత్తం హౌస్‏లోకి 19 మంది కంటెస్టెంట్స్‏ను పంపించారు నిర్వహాకులు. దీంతో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేనట్లుగానే తెలుస్తోంది. అయితే ఇంట్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‏లలో కొన్ని కొత్త ముఖాలు కూడా ఉన్నాయి. ఇక మొదటి రోజే తన గురకతో తోటి కంటెస్టెంట్లకు నిద్రలేకుండా చేశాడు లోబో. అతని గురకను భరించలేక ముఖంపై దుప్పటి కప్పి, దిండ్లు పెట్టి గురకను ఆపే ప్రయత్నం చేశాడు యాంకర్ రవి.. అయినా ఫలితం లేకపోయింది. అలాగే శ్వేతా, హమిద, జెస్సీలు కూర్చుని ముచ్చట్లు పెట్టారు. మరోవైపు తమకు బోర్ కొడుతుందంటూ.. ఉదయాన్నే సిరి, జెస్సీలు కలసి.. ఇంట్లో వాళ్ల వస్తువులను దాచేశారు.

ఇక ఉదయాన్నే ప్రణామం ప్రణామం అనే పాటతో ఇంటి సభ్యులను నిద్రలేపాడు బిగ్‏బాస్. పాటకు తమదైన స్టెప్పులతో అలరించారు. ఇక తమ వస్తువులు కనిపించడం లేదని.. ఇంటి సభ్యులు అరచి గగ్గోలు పెట్టగ.. రవి ఇంటి దొంగలను పసిగట్టేశాడు. జెస్సీ దొంగతనం చేశాడని చెప్పగా.. సిరి, జెస్సీలు నిజం అంగీకరించారు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. హౌస్‏లోకి ట్రాన్స్‏జెండర్‏గా అడుగుపెట్టిన ప్రియాంక.. తన మనసులోని మాటలను మరోసారి బయటపెట్టింది. తన గురించి తాను చెప్పుకుంటూ.. ట్రాన్స్‏జెండర్‏గా మారిన విషయాన్ని కాజల్‏తో చెప్పుకుంది. తను ట్రాన్స్‏జెండర్‏గా మారిన విషయం ఇప్పటికీ వాళ్ల నాన్నకు తెలియదని.. అలా మూడేళ్లుగా మోసం చేస్తూనే వచ్చానని.. ఓసారి మీసం, గెడ్డం ఏవిరా అని అడిగితే.. లేడీ గెటప్ కోసం తీసేసా అని అబద్ధం చెప్పా అంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో కాజల్ ఆమెను దగ్గరకుు తీసుకుని ఓదార్చింది. ఇదే విషయాన్ని బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జునతో కూడా చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. అలాగే.. తను ట్రాన్స్‏జెండర్‏గా మారిన విషయాన్ని బిగ్ బాస్ వేదిక ద్వారా వాళ్ల నాన్నకు తెలియజేసిన సంగతి తెలిసిందే.

Also Read: Catwalk: నడిరోడ్డుపై మహిళలు, చిన్నారుల క్యాట్ వాక్.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.. అసలు మ్యాటర్

ఏంటంటే.

మీ ఇంట్లో ఉన్న ఆయిల్ బాటిల్.. టీ పొడి.. నకిలీ కావొచ్చు.. అచ్చం అచ్చు గుద్దినట్లుగా

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu