Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఉన్న ఆయిల్ బాటిల్.. టీ పొడి.. నకిలీ కావొచ్చు.. అచ్చం అచ్చు గుద్దినట్లుగా

ఏదీ నకిలీనో.. అది అసలో తెలియదు. పోలీసులు రంగంలోకి దిగి.. దాడులు చేస్తే గాని కల్తీ గాళ్ల.. నకరాలు బయటపడలేదు. దీంతో మరిన్ని దాడులకు సిద్ధమయ్యారు పోలీసులు.

మీ ఇంట్లో ఉన్న ఆయిల్ బాటిల్.. టీ పొడి.. నకిలీ కావొచ్చు.. అచ్చం అచ్చు గుద్దినట్లుగా
Oil
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 07, 2021 | 7:10 AM

కల్తీ.. కల్తీ .. కల్తీ … కర్నూలు జిల్లాలో నకిలీ వస్తువులు, కల్తీ పదార్థాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ప్రత్యేక దృష్టితో చూస్తే తప్ప ఏది నకిలీనో.. ఏది ఒరిజినలో తెలియకుండా ఉంది. ఒరిజినల్ కంటే నకిలీ వస్తువులే ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున నకిలీ హెయిర్ ఆయిల్ బాటిల్స్, కల్తీ రెడ్ లేబుల్ టీ పౌడర్ బాక్సులు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. కొంతకాలంగా జిల్లాలో పారాషూట్ కంపెనీకి చెందిన హెయిర్ ఆయిల్ సేల్స్ తగ్గిపోయాయి. రెడ్ లేబుల్ టీ సేల్స్ కూడా పడిపోయాయి. ఆరా తీసిన పారాషూట్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారించిన పోలీసులు దాడులు చేసి నకిలీ పారాషూట్ హెయిర్ ఆయిల్, రెడ్ లేబుల్ టీ పౌడర్ బాక్సులను పెద్ద ఎత్తున పట్టుకున్నారు. హైదరాబాద్ కాచిగూడకు చెందిన కమల్ bhati, మూసాపేటకు చెందిన సంజయ్ అనే ఇద్దరు తయారీదారులను అరెస్ట్ చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రవికుమార్, సత్యనారాయణ శెట్టి, ఖాదర్ భాష అనే విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్లో చాలా సరుకులు నకిలీవి పోటెత్తుతుండటంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పైన ప్యాకింగ్‌ ఒరిజినల్‌ మాదిరి కనిపించినా.. లోపల ఏమాత్రం నాణ్యతలేని సరుకులు ఉంటాయి. ఇలాంటి నకిలీ వస్తువులు విక్రయించే వారి సమాచారం తమకివ్వాలని సూచిస్తున్నారు కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.

ఇవి కూడా చదవండి: Beauty Tips: గుడ్డు పెంకును పారేస్తున్నారా?.. దాని ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..!

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..