Karthik Deepam: మోనిత రెడీ.. కార్తీక్ కంగారు.. దీప అనుమానం.. కార్తీకదీపం టెన్షన్.. టెన్షన్
కార్తీకదీపం ఆకట్టుకునే కథనంతో సాగిపోతోంది. ఇంటిళ్ళపాదీ మెచ్చిన కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1138వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మోనిత ఉచ్చులో చిక్కుకున్న కార్తీక్..
Karthik Deepam: కార్తీకదీపం ఆకట్టుకునే కథనంతో సాగిపోతోంది. ఇంటిల్లపాదీ మెచ్చిన కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1138వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మోనిత ఉచ్చులో చిక్కుకున్న కార్తీక్.. మోనిత బ్రతికే ఉందని నమ్ముతున్న దీప.. కార్తీక్ విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఏసీపీ రోషిణి.. బెదిరించి పెళ్లి చేసుకోవాలని చూస్తున్న మోనిత.. కార్తీక్ బయటకు రావాలని ఎదురు చూస్తున్న కుటుంబం వీరందరి మధ్యా జరుగుతున్న సంఘటనల సమాహారం అందరినీ ఆకట్టుకుంటోంది. మరి కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు ఏమి జరుతుందో తెలుసుకుందామా?
నిన్నటి ఎపిసోడ్ (1137) లో జరిగింది ఇదీ..
కార్తీక్ కు ఫోన్ చేసిన మోనిత రేపే మన పెళ్లి.. పంతులు గారు ముహూర్తం పెట్టారు అని చెబుతుంది. ఇదే ఆఖరి ఛాన్స్ అనీ..పెళ్లి చేసుకోకపోతే కుటుంబం మొత్తాన్ని చంపెస్తాననీ బెదిరిస్తుంది. మరోవైపు దీప తీవ్రంగా ఆలోచిస్తుంది. అసలు కార్తీక్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అంత బేలగా ఎందుకు తయారయ్యాడు? తన ధైర్యాన్ని ఎందుకు కోల్పోయాడు? వంటి ప్రశ్నలతో సతమతమౌతుంది. ఈ ఆలోచనల్లోనే ఆమెకు ఒక అనుమానం వస్తుంది. కార్తీక్ కు కడుపునొప్పి వెంటనే తగ్గిపోయినా ఆసుపత్రిలో ఇంకా ఎందుకు ఉంచారు అనే డౌట్ తలెత్తుతుంది దీపకు. దీంతో ఏసీపీ రోషిణిని కలిసి విషయం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఊరు వెళ్ళిన సౌందర్య తిరిగి వస్తుంది. సోఫాలోనే పడుకున్న ఆనందరావును చూసి బాధపడుతుంది. ఇద్దరూ కలిసి కార్తీక్ ను కోర్టుకు తీసుకువెళితే ఏం జరుగుతుందో అనే విషయంపై చర్చించుకుంటారు.
దీప ఏసీపీ రోషిణిని కలుస్తుంది. అయితే, తానూ మొదట దీపతో మాట్లాడటానికి ఇష్టపడదు. కానీ, దీప ఆమెను తనతో మాట్లాడేలా చేస్తుంది. తనకు వచ్చిన అనుమానాన్ని దీప చెబుతుంది. కానీ, రోషిణి ఆ అనుమానాన్ని కొట్టి పారేస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ జరిగాకా అవసరం అయితే కడుపు క్లీన్ అయ్యేవరకూ ఆసుపత్రిలో ఉంచడం సహజం అని చెబుతుంది. దానికి దీప అలా అయితే, రోజూ మందులు ఇవ్వాలి కదా? మందులు కూడా ఇవ్వడం లేదు అని రోషిణికి చెబుతుంది. దీంతో రోషిణిలో ఆలోచన మొదలవుతుంది. దీప మోనిత బ్రతికే ఉందనేది తన నమ్మకం అనీ.. కార్తీక్ కు స్టేషన్ లో మూగమ్మాయి వేషంలో వచ్చి టీ ఇచ్చింది ఆమే అని చెబుతుంది. మోనిత బ్రతికే ఉందేమో అనే కోణంలో ఒకసారి దృష్టి సారించమని రోషిణిని కోరుతుంది.
దీప మాటలతో రోషిణిలో అనుమానం మొదలవుతుంది. తన స్టేషన్ లో ఏదైనా తప్పు జరిగిందా? అని సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తుంది. కానిస్టేబుల్ రామసీతను పిలిచి స్టేషన్ పరిస్థితులపై ఆరా తీస్తుంది. రామసీతను కార్తీక్ ఆసుపత్రికి వెళ్ళినరోజు టీ తీసుకువచ్చిన మూగమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అయితే, రామసీత నాకు తెలియదు మేడం. నేను ఆరోజు మీతోనే ఉన్నాను అని చెబుతుంది. ఈలోపు సీసీ టీవీ ఫుటేజీల్లో కార్తీక్ ఆసుపత్రికి వెళ్ళినరోజు ఫుటేజ్ మిస్ అయిన విషయం గమనిస్తుంది. అదే విషయాన్ని రామసీతను అడుగుతుంది. ఇదీ నిన్నటి ఎపిసోడ్ (1137) లో జరిగిన కథ. మరి ఈరోజు ఎపిసోడ్ (1138)లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
రామసీత టెన్షన్
సీసీ టీవీ ఫుటేజ్ మిస్ అవడానికి కారణం ఆరోజు అన్ని కెమెరాలు సర్వీసింగ్ కి ఇవ్వడం అని రామసీత ఏసీపీ రోషిణికి చెబుతుంది. సీసీ కెమెరాలు సర్వీసింగ్ కి వెళ్ళడం..ఎవరో తెలీని వ్యక్తి వచ్చి టీ ఇవ్వడం..ఇవన్నీ చూస్తుంటే మన స్టేషన్ లోనే ఎవరో ఎదో చేస్తున్నారని అనిపిస్తోంది అని రోషిణి అంటుంది. దీంతో రామసీతలో టెన్షన్ మొదలవుతుంది.
సౌర్య అనుమానం
మరోవైపు కార్తీక్ ను కోర్టుకు తీసుకువెళ్ళాల్సింది ఆరోజే అని సౌందర్య ఆనందరావుతో చెబుతుంది. తాను కోర్టుకు వెళతానని చెబుతుంది. ఆనందరావు కూడా కోర్టుకు వస్తానని అంటాడు. దానికి సౌందర్య వద్దని వారిస్తుంది. అక్కడ మీరు కార్తీక్ ను చూస్తె తట్టుకోలేరు. అంటుంది. దానికి ఆనందరావు ఇక్కడ ఉన్నా కార్తీక్ కు ఏమైందనే ఆలోచనలను తట్టుకోలేను. నేను నిబ్బరంగా ఉంటాను. నేనూ అక్కడికి వస్తాను అంటాడు. ఆనందరావు అలా అన్నాక సరే అంటుంది సౌందర్య. ”మోనిత తిరిగి వచ్చేస్తే.. కార్తీక్ బయటకు వచ్చేస్తాడు. దేవుని దయవలన అలా జరగాలి.” అని సౌందర్య ఆనందరావుతో అంటుంది. ఈ మాటలు సౌర్య వింటుంది. నానమ్మా.. మోనిత ఆంటీ వస్తే.. డాడీ జైలు నుంచి బయటకు రావడం ఏమిటీ అని ప్రశ్నిస్తుంది.
కార్తీక్ కంగారు
దీప కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఎదో ఆలోచనలో ఉన్న కార్తీక్ ను చూసి ఏమిటి ఆలోచిస్తున్నారు. మీ మోహంలో కంగారు స్పష్టంగా బయటకు కనబడిపోతోంది. ఆనుతుంది దీప. నేను మీ గురించే ఆలోచిస్తున్నాను అంటాడు కార్తీక్. నాకంటే ఎక్కువ మీ గురించే ఆలోచన. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను జైలుకు వెళ్ళినా మీరంతా క్షేమంగా ఉండాలి అని కార్తీక్ చెబుతాడు. దీంతో దీపలో అనుమానం మరింత బలపడుతుంది. మీరు మొనితను చూశారు కదూ. అని అడుగుతుంది. ఆ విషయం చెప్పట్లేదు. మీరు మోనిత బ్రతికే ఉంది అని నమ్ముతున్నాను అని ఒక్క మాట చెప్పండి. అది ఏ కలుగులో దాక్కున్నా తీసుకువచ్చి రోషిణి మేడం కాళ్ళ ముందు పాడేస్తాను అని ఆవేశంగా అంటుంది. దానికి కార్తీక్ వద్దు అటువంటి సాహసాలు చేయొద్దు. నువ్వు రిస్క్ తీసుకోవద్దు. అని బ్రతిమిలాడతాడు.
మోనిత సంతోషం
అక్కడ మోనిత పెళ్లి చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళడానికి సంతోషంగా తయారవుతూ ఉంటుంది. ఇదే సమయంలో రామసీత అక్కడికి వస్తుంది. ”రా రామసీత ఈరోజు నాకూ, కార్తీక్ కు పెళ్లి” అని చెబుతుంది మోనిత. దానికి రామసీత..”మేడం మళ్ళీ ఆలోచించండి మేడం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు.” అంటుంది. కానీ, మోనిత వినదు. దీంతో రోషిణి తనను ప్రశ్నించిన విషయం.. సీసీ టీవీల ఫుటేజ్ గురించి గుచ్చి గుచ్చి అడిగిన వైనం చెబుతుంది రామసీత. దీంతో మోనిత ”అయినా ఏమీ కాదు. నేను పెళ్లి చేసుకున్న వెంటనే లొంగిపోతాను. నువ్వేమీ కంగారు పడకు. ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు. ఎందుకంటే మీ ఫోన్ లు ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది.” అని చెబుతుంది. తరువాత రామసీత సరే మీ ఇష్టం అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
రోషిణి అసహనం
ఏసీపీ రోషిణి స్టేషన్ లో రైటర్ ను పిలిచి చీవాట్లు పెడుతుంది. స్టేషన్ లోకి ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో కూడా మీకు తెలియడం లేదు. కొత్తవాళ్ళు వస్తే వాళ్ళు ఎవరనేదీ తెలుసుకోవడం లేదు. అని కేకలు వేస్తుంది. తరువాత..”కార్తీక్ ను కోర్టుకు తీసుకువెళ్ళాలి. దానికి అవసరమైన పేపర్లు సిద్ధం చేసి కోర్టు దగ్గరకు పంపించండి. నేను చిన్న ఎంక్వయిరీ ఉంది అది చూసుకుని కార్తీక్ ను తీసుకుని కోర్టుకు వస్తాను” అని చెప్పి బయలుదేరుతుంది.
ఇదీ ఈరోజు ఎపిసోడ్ (1137)లో జరిగింది. కార్తీక్ ను కోర్టుకు తీసుకువేల్లారా? మోనిత వేసిన పథకం పరిందా? దీప మోనితను పట్టుకోగాలిగిందా? ఇవన్నీ తెలియాలంటే.. రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1138 వరకూ వేచి చూడాల్సిందే.
మరిన్ని ‘కార్తీకదీపం’ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!
Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!
Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు..
Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!
Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!