Surprising Video: చిన్న పిల్లలా ఏడుస్తున్న పక్షి.. నెట్టింట్లో సంచలనంగా మారిన షాకింగ్ వీడియో..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 07, 2021 | 6:45 AM

Surprising Video: ప్రపంచం వింత విషయాలతో నిండి ఉంది. కొన్నిసార్లు కొన్ని జంతువులు చూసి ఇదేంటి అని ఆశ్చర్యపోతుంటారు.

Surprising Video: చిన్న పిల్లలా ఏడుస్తున్న పక్షి.. నెట్టింట్లో సంచలనంగా మారిన షాకింగ్ వీడియో..
Bird

Surprising Video: ప్రపంచం వింత విషయాలతో నిండి ఉంది. కొన్నిసార్లు కొన్ని జంతువులు చూసి ఇదేంటి అని ఆశ్చర్యపోతుంటారు. తాజాగా విచిత్రమైన స్వరం ఉన్న పక్షిని చూసిన తర్వాత ప్రజలు అలాగే షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఒక పక్షికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో దాని వాయిస్ విని నెటిజన్లు, ప్రజలు షాక్ అవుతున్నారు. ఈ వీడిలో సదరు పక్షి అచ్చం పసి పిల్లాడి మాదిరిగానే ఏడుస్తోంది. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ పక్షి వాయిస్ చూసి నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారు.

ఈ భూమిపై ఎన్నో విచిత్రాలు దాగి ఉన్నాయి. మనం చూసినవి కొన్ని మాత్రమే. చూడనివి కోకొల్లలు అని చెప్పాలి. అలా ఎన్నడూ చూడని వింతలు ఒక్కసారిగా కనిపించడంతో వాటిని విశ్వసించలేకపోతాము. తాజాగా ఈ పక్షి విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రకృతిలో మనుషులతో పాటు కొన్ని కోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో బయటి ప్రపంచానికి తెలిస్తే కొద్ది శాతం మాత్రమే. తాజాగా సోషల్ మీడియాలో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న పక్షికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో జనాలు నమ్మలేకపోతున్నారు. పక్షి స్వరం మనిషిలా ఉండటం ఏంటని షాక్ అవుతున్నారు. కానీ, నిజంగా నిజం. ఓ పక్షి అచ్చం చిన్న పిల్లాడి మాదిరిగా ఏడుస్తోంది. ఈ వీడియోను సిడ్నీకి చెందిన తారోంగ జూ పార్క్‌ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

లైర్ బర్డ్ అనే ఈ పక్షి అచ్చం మానవ శిశువులా ఏడుస్తోంది. ఇది మాత్రమే కాదు.. ఈ పక్షి అనేక రకాల శబ్ధాలు చేయగలదు. లైర్‌బర్డ్ పక్షి ఏదైనా ధ్వనిని గుర్తించడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంది. తాను విన్న శబ్ధాన్ని తిరిగి ధ్వనింపజేస్తోంది. కాగా, లైర్‌బర్డ్ విచిత్ర శబ్ధాలకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోకు జనాలు ఫిదా అయిపోతున్నారు. దాని అరుపులపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

JEE Main 2021 Answer Key: జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Beauty Tips: గుడ్డు పెంకును పారేస్తున్నారా?.. దాని ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..!

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu