JEE Main 2021 Answer Key: జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 07, 2021 | 6:40 AM

JEE Main 2021 Answer Key: జేఈఈ మెయిన్ 2021 సెషన్ 4 పరీక్ష జవాబు కీ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దీనిని విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్..

JEE Main 2021 Answer Key: జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Jee Main 2021

JEE Main 2021 Answer Key: జేఈఈ మెయిన్ 2021 సెషన్ 4 పరీక్ష జవాబు కీ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దీనిని విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ సెషన్ 4 రాసిన విద్యార్థులు ఈ కీ పేపర్‌ను అధికారిక వెబ్‌సైట్ అయిన jeemain.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. ఈ తాత్కాలిక ఆన్సర్ కీ లో ఏవైనా సమాధానాల పట్ల అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు దానిపై ఫిర్యాదు చేయొచ్చు. అయితే, ప్రతీ ప్రశ్నకు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. అభ్యంతర వ్యక్తం చేసిన ప్రశ్నకు ఆధారాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే వారి అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోబడదు.

ఇలా ఆన్సర్ ‘కీ’ ని చూసుకోండి.. 1. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2021 సెషన్ 4 ఆన్సర్ ‘కీ’ ని చూడటానికి, డౌన్‌లోడ్ చేసుకోవడాని అధికారిక పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 2. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి. 3. ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు(అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, మొదలైన వివరాలు) నింపడం ద్వారా లాగిన్ అవ్వాలి. 4. ఆ తరువాత అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్స్ రెస్పాన్స్ షీట్, అధికారిక ‘ఆన్సర్ కీ’ ని చూడొచ్చు. 5. అక్కడ ఇచ్చిన ఆప్షన్ ఆధారంగా ‘ఆన్సర్ – కీ’ ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2021 ఆన్సర్ కీ ని ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇదిలాఉంటే.. ఆగస్టు 26, 27, 31 తేదీల్లో, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరిగిన సెషల్ 4 పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష పత్రం కాస్త కష్టంగా, కాస్త సులువగా ఉంది. అన్ని సెషన్లలో గణితం కఠినంగా ఉంటే.. ఫిజిక్స్, కెమెస్ట్రీ మాత్రం కాస్త ఈజీగా ఉంది.

అక్టోబర్ 3 న జేఈఈ అడ్వాన్స్‌డ్.. జేఈఈ మెయిన్ 2021 లో ఉత్తీర్ణులైన టాప్ 2,50,000 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ నాలుగు సెషన్లలో నిర్వహించారు. ఒకటి కంటే ఎక్కువ సెషన్లకు హాజరైన అభ్యర్థులు, పరీక్షలో వారి అత్యుత్తమ ప్రదర్శన మెరిట్ జాబితా, తుది ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్ 2021 సెషన్ 4 వ సెషన్ ఫలితాతో పాటు.. ఎన్టీఏ ఆల్ ఇండియా ర్యాంకింగ్ జాబితాను కేటగిరీల వారీగా కట్-ఆఫ్‌ను ప్రచురిస్తుంది. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్ అక్టోబర్ 3వ తేదీన జరగాల్సి ఉంది. వాటి ఫలితాలు అక్టోబర్ 15న ప్రకటిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల తర్వాత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్, ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఐఐటీ లలో ప్రవేశానికి సంబంధించినది. దీనికి అక్టోబర్ 15 న పరీక్ష నిర్వహించనున్నారు.

Also read:

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Government of India: శుభవార్త.. దీపావళికి ముందు వారి అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.. బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu