SBI Apprentice Admit Card 2021: ఎస్‌బీఐ అప్రెంటిస్ ఎగ్గామ్ హాల్ టికెట్ విడుదల.. పూర్తి వివరాలివే..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 07, 2021 | 5:54 AM

SBI Apprentice Admit Card 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటీస్ పోస్టుల భర్తీలో భాగంగా పరీక్ష కోసం అడ్మిట్ కార్డును విడుదల చేసింది.

SBI Apprentice Admit Card 2021: ఎస్‌బీఐ అప్రెంటిస్ ఎగ్గామ్ హాల్ టికెట్ విడుదల.. పూర్తి వివరాలివే..
Sbi

Follow us on

SBI Apprentice Admit Card 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటీస్ పోస్టుల భర్తీలో భాగంగా పరీక్ష కోసం అడ్మిట్ కార్డును విడుదల చేసింది. ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారం.. జులై 6వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా.. జులై 20వ తేదీని దరఖాస్తుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 6,100 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించబోయే ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డు ను తాజాగా విడుదల చేశారు. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా.. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన కరెంట్ ఓపెనింగ్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్‌కు వెళ్లండి. లాగిన్ కోసం ఆ లింక్‌పై క్లిక్ చేయండి. అడిగిన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తదుపరి వినియోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

రాష్ట్రాల వారీగా సీట్లు.. 1. గుజరాత్- 800 పోస్టులు 2. ఆంధ్రప్రదేశ్ – 100 పోస్టులు 3. కర్ణాటక -200 పోస్టులు 4. మధ్యప్రదేశ్- 75 పోస్టులు 5. ఛత్తీస్‌గఢ్- 75 పోస్టులు 6. లడఖ్ – 10 పోస్టులు 7. పంజాబ్ – 365 పోస్ట్లు 8. ఉత్తరప్రదేశ్ – 875 పోస్టులు 9. మహారాష్ట్ర- 375 పోస్టులు 10. పశ్చిమ బెంగాల్- 715 11. అండమాన్ & నికోబార్ – 10 పోస్టులు 12. సిక్కిం – 25 పోస్టులు 13. ఒరిస్సా- 400 పోస్టులు 14. హిమాచల్ ప్రదేశ్- 200 పోస్టులు 15. హర్యానా- 150 పోస్టులు 16. J & K- 100 పోస్ట్‌లు 17. యుటి చండీగఢ్- 25 పోస్టులు 18. అరుణాచల్ ప్రదేశ్ – 20 పోస్టులు 19. అస్సాం- 250 పోస్టులు 20. మణిపూర్ – 20 పోస్టులు 21. మేఘాలయ – 50 పోస్టులు 22. మిజోరం – 20 పోస్టులు 23. నాగాలాండ్ – 20 పోస్టులు 24. త్రిపుర – 20 పోస్ట్లు 25. బీహార్ – 50 పోస్టులు 26. జార్ఖండ్- 25 పోస్టులు 27. తమిళనాడు- 90 పోస్టులు 28. పుదుచ్చేరి – 10 పోస్టులు 29. గోవా -50 పోస్టులు 30. ఉత్తరాఖండ్ -125 పోస్టులు 31. తెలంగాణ- 125 పోస్టులు 32. రాజస్థాన్ – 650 పోస్టులు 33. కేరళ- 75 పోస్టులు

Also read:

SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..

Agency Rains: నాన్ స్టాఫ్ వర్షాలు.. వరద బీభత్సం. నడుముల్లోతు నీటితో మన్యంలో పరిస్థితి ఆగమ్యగోచరం

Ashu Reddy: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి.. ఇంతకీ కారణం ఏంటంటే.?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu