TS Inter Time Table: తెలంగాణ ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే.
TS Inter Time Table: కరోనా కారణంగా మూతపడ్డ విద్యా సంస్థలు ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు
TS Inter Time Table: కరోనా కారణంగా మూతపడ్డ విద్యా సంస్థలు ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్‌లందరికీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ జారీ చేశారు. ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ మాట్లాడుతూ.. అందరూ అకడమిక్ క్యాలెండర్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. దీనిని ఉల్లంఘించిన ప్రిన్సిపల్స్, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అఫిలియేషన్ రద్దు చేయడంతో పాటు ఇతర చర్యలు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది కాలేజీ వర్కింగ్ డేస్ 220 రోజులు ఉండేలా ప్లాన్ చేశారు. జూలై 1వ తేదీ నుంచే ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైన తరుణంలో అన్ లైన్ క్లాసులు 47 రోజులు.. ఫిజికల్ 173 రోజులు ఉండేలా అకడమిక్ ఇయర్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు థీయరి పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 13ను జూనియర్ కాలేజీలకు చివరి వర్కింగ్‌డేగా నిర్ణయించారు.
Viral Video: ‘కాశ్మీరీ పులావ్’లో కాశ్మీర్ ఉంటుందా.. ప్రశ్నించిన చాహల్ భార్య..! ఎందుకో తెలుసా?
Shashi Tharoor: గాయకుడి అవతారమెత్తిన శశిథరూర్.. కేంద్ర మాజీ మంత్రి టాలెంట్‌కు వీక్షకులు ఫిదా..