Government of India: శుభవార్త.. దీపావళికి ముందు వారి అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.. బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి..

Shiva Prajapati

Shiva Prajapati | Edited By: Ravi Kiran

Updated on: Sep 07, 2021 | 8:05 AM

Government of India: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు శుభవార్త. దీపావళికి ముందు రిటైర్మెంట్ ఫండ్ బాడీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి (FY21) వడ్డీ రేటును పెన్షన్ దారుల..

Government of India: శుభవార్త.. దీపావళికి ముందు వారి అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.. బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి..
Money


Government of India: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు శుభవార్త. దీపావళికి ముందు రిటైర్మెంట్ ఫండ్ బాడీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి (FY21) వడ్డీ రేటును పెన్షన్ దారుల ఖాతాలో క్రెడిట్ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇపిఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ వడ్డీ రేట్ల పెరుగుదలను ఆమోదించింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం వేచి చూస్తోంది.

అధికారిక సమాచారం ప్రకారం.. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్(డిఎ), డియర్‌నెస్ రిలీఫ్‌తో పాటు మరింత నగదు లబ్ధిపొందుతారని అధికారులు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కేవలం ప్రోటోకాల్‌కు సంబంధించిన విషయం అని కొందరు వాదిస్తుండగా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా వడ్డీ రేటును క్రెడిట్ చేయబోరంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈపీఎఫ్ఓ వోర్డు తన ఆర్థిక స్థితి ఆధారంగా ముందుకు సాగుతుందంటున్నారు ఇంకొందరు.

7 సంవత్సరాలలో అతి తక్కువ వడ్డీ రేటు..
మార్చిలో బోర్డు ఆర్థిక సంవత్సరం 2021 కోసం 8.5% చెల్లింపును సిఫార్సు చేసింది. ఈపీఎఫ్ఓ గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ .70,300 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. ఇందులో దాని ఈక్విటీ పెట్టుబడులలో కొంత భాగాన్ని విక్రయించడం ద్వారా సుమారు రూ. 4,000 కోట్లు సమకూర్చుకుంది. 2020 లో కోవిడ్ -19 వ్యాప్తి తరువాత, ఈసీఎఫ్ఓ మార్చి 2020లో పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించింది. గత 7 సంవత్సరాలలో ఇది అతి తక్కువ వడ్డీ రేటు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 8.55 శాతం మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇది 8.5 శాతం.

ఇలా బ్యాలెన్స్ చెక్ చేయండి..
వడ్డీ జమ అయిన తర్వాత, పీఎఫ్ చందాదారులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ స్థితిని నాలుగు విధాలుగా తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి సబ్‌స్క్రైబర్‌లు తప్పనిసరిగా వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను యాక్టివేట్ చేయాలి.

SMS ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయండి..
ఈపీఎఫ్ఓ చందాదారులు SMS పంపడం ద్వారా వారి ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ని కూడా తనిఖీ చేయవచ్చు. దీని కోసం, 7738299899 నంబర్‌కు సందేశం పంపాలి. “EPFOHO UAN ENG” అని వ్రాసి, ఇచ్చిన మొబైల్ నంబర్‌కు పంపండి. SMS పంపిన తరువాత ఈపీఎఫ్ఓ మీకు తిరిగి పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలను పంపుతుంది.

మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయండి..
బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ​మిస్డ్ కాల్ సౌకర్యాన్ని కూడా ఇచ్చింది. మీరు 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. అయితే, దీని కోసం ఈపీఎఫ్ఓ చందాదారుల ఫోన్ నెంబర్ పీఎఫ్ ఖాతాతో లింక్ చేయబడి ఉండాలి. ఇది కాకుండా ఈపీఎఫ్ఓ సభ్యుడు UAN, KYC వివరాలతో లింక్ చేయబడాలి.

ఈపీఎఫ్ఓ​పోర్టల్ ద్వారా చెక్ చేయండి..
ఈపీఎఫ్ఓ చందాదారుల పోర్టల్‌లో మిమ్మల్ని మీరు నమోదు చేసుకున్న తర్వాత మీ UAN, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login# కి లాగిన్ చేయండి. దీనితో మీరు మీ పాస్‌బుక్‌ను చూడవచ్చు.

ఉమాంగ్ యాప్ నుంచి కూడా బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు..
ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ఖాతా బ్యాలెన్స్, ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌ను ‘UMANG’ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా చూడవచ్చు. ఎంప్లాయీ ఫోకస్డ్ సర్వీసెస్‌కి వెళ్లి పాస్‌బుక్‌ను చూడండి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌లో మీ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మీరు UAN ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో పంపిన మీ OTP ని కూడా ఎంటర్ చేయాలి. అలా లాగిన్ అయిన తరువాత మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

Also read:

Childrens Immunity: అసలే కరోనా కాలం.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఇలా పెంచండి..!

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Anger Management: మీకు తరచుగా కోపం వస్తుందా?.. అయితే, ఈ నాలుగు టిప్స్‌ని ట్రై చేయండి.. కోపాన్ని జయించండి..


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu