Jayalalitha: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, హత్య కేసులో మళ్లీ సంచలన విషయాలు
తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొడనాడ్ ఏస్టేట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన వాచ్‌మెన్ హత్య, దోపిడి వ్యవహారంలో
2017 Kodanad heist-murder: తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొడనాడ్ ఏస్టేట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన వాచ్‌మెన్ హత్య, దోపిడి వ్యవహారంలో ఎస్టేట్ మేనేజర్‌ను పోలీసులు ఇవాళ ప్రశ్నించారు. జయ బంగ్లాలో జరిగిన 20 కోట్ల విలువైన నగదు, బంగారం దోపిడీపై ఆరా తీశారు. కాగా, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత అప్పట్లో జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. జయకు చెందిన ఆస్తులను కాజేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నీలగిరి జిల్లాలోని కొడనాడ్‌లోని జయలలిత ఏస్టేట్‌లో 2017 ఏప్రిల్‌లో వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు ఎస్టేట్‌లోని చొరబడి కీలక పత్రాలను కాల్చేసి, బంగారం నగదు దోచుకుపోతుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాచ్‌మెన్ ఓంకార్‌ను హత్య చేశారు.
2017లో కొడనాడ్ జయ ఎస్టేట్‌లో జరిగిన ఈ హత్య, దోపిడీ ఘటనలపై విచారణ కొంత కాలం తర్వాత ఆగిపోయింది. తాజాగా పోలీసులు మళ్లీ విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో జయ ఎస్టేట్ మేనేజర్‌గా ఉన్న నటరాజన్‌ను పోలీసుల విచారించారు. నీలగిరి జిల్లా ఏస్పీ ఆశిష్, ఐజీ ఆర్. రావత్ రెండు గంటల పాటు ఆయన్ని ప్రశ్నించారు.
కొడనాడ్ జయ ఎస్టేట్ బంగ్లా నుంచి దాదాపు 20 కోట్ల రూపాయల విలువ జేసే బంగారం, నగదు దోపిడీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కొడనాడ్ ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య జరిగిన కొద్ది రోజులకే జయడ్రైవర్ కనకరాజు రోడ్డు ప్రమాదంలో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. వాచ్‌మెన్ హత్య వ్యహారంలో కనకరాజు ప్రమేయం ఉండొచ్చని అప్పట్లో పోలీసులు భావించారు. విచారణలో భాగంగా అప్పట్లో కొందరిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం మరోసారి తెర మీదకు వస్తోంది.
Read also: Crime News: హైవేపై సినీ ఫక్కీలో దారి దోపిడీ.. దర్యాప్తులో నిజాలు తెలిసి షాక్‌కు గురైన పోలీసులు